ఓటిటిలో స్టార్ గా మారిన “పుష్ప” విలన్

మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ఇప్పుడు ఓటిటి స్టార్ అయిపోయారు. ఒకవైపు కరోనా మహమ్మారి కారణంగా సినిమాలన్నీ ఆగిపోతే ఆయన మాత్రం వరుసగా ఓటిటిలో తన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒక్క సంవత్సరంలోనే ఆయన హీరోగా నటించిన సి యు సూన్, జోజి, ఇరుల్ వంటి సినిమాలను నేరుగా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై విడుదల అయ్యాయి. ఇప్పుడు అదే జాబితాలో ఆయన నటించిన మరో చిత్రం చేరిపోతోంది. ఈ ప్రతిభావంతుడైన నటుడు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ప్రాజెక్ట్ “మాలిక్”ను కూడా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు.

Read Also : దుల్కర్ సల్మాన్ తో అక్కినేని హీరో మల్టీస్టారర్

ఈ క్రైమ్ థ్రిల్లర్ నిన్న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయింది. రామదప్పల్లి అనే గ్రామంలో నివసిస్తున్న సులేమాన్ మాలిక్ అక్కడి పోలీసులు, రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా పోరాడి ప్రజలకు దేవుడిగా ఎలా మారాడు అనేదే చిత్ర కథాంశం. “మాలిక్”లో నిమిషా సజయన్ హీరోయిన్ గా నటించింది. వినయ్ ఫోర్ట్, జోజు జార్జ్, దిలీష్ పోథన్ ఇందులో ఇతర ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఫహాద్ మూడు వేర్వేరు గెటప్‌లలో కన్పించాడు, మూడు వేర్వేరు వయసులల్లో ఉన్న వ్యక్తిగా మాలిక్ నటించాడు. మహేష్ నారాయణన్ దర్శకత్వంలో “మాలిక్” రూపొందింది. ఆయన ఇంతకు ముందు “టేక్ ఆఫ్”, “సి యు సూన్” చిత్రాలు చేశారు. అమెజాన్ ప్రైమ్ లో ఫహద్ అభిమానులు ఈ చిత్రాన్ని వీక్షించొచ్చు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-