శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర అనే సినిమా ప్రేక్షలు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ధనుష్ హీరోగా, నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మరో కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు ఏడాదిన్నర క్రితం మొదలైంది. సినిమా అనౌన్స్‌మెంట్ అయితే మూడేళ్ల క్రితమే వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అమెజాన్ ప్రైమ్‌తో ఉన్న అగ్రిమెంట్స్ కారణంగా ఆ విడుదల తేదీని మార్చలేని పరిస్థితి.
Also Read:‘OG’ : పవన్ కల్యాణ్ ‘OG’ లో జపనీస్ యాక్టర్..
అయితే సినిమా రిలీజ్‌కు ఇంకా పది రోజులుంది కానీ ఇంకా ఒక సాంగ్ పూర్తి కాలేదు, అలాగే సినిమా రీ-రికార్డింగ్ కూడా పూర్తి కాలేదు. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత ఏషియన్ సునీల్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక మరో మూడు రోజుల్లో సినిమాకు సంబంధించిన ట్రైలర్ కట్ రిలీజ్ కావాల్సి ఉంది. ఆ తర్వాత మరో రెండు రోజులకు మరో సాంగ్ రిలీజ్ కావాల్సి ఉంది. దేవిశ్రీ ప్రసాద్ కారణంగా ఎప్పుడూ సినిమాకు లాస్ట్ మినిట్ టెన్షన్ ఏర్పడినట్లుగా సినీ వర్గాల వారు చెబుతున్నారు.
Also Read:Kingdom : కింగ్ డమ్ వాయిదా తప్పదా..?
శేఖర్ కమ్ముల తన టీంతో కలిసి సినిమాకు సంబంధించిన పెండింగ్ వర్క్స్ పూర్తి చేయడానికి శాయశక్తులా కృషి చేస్తున్నాడు. సినిమాకు ఇప్పుడిప్పుడే కాస్త బజ్ పెరుగుతోంది. అయితే దేవిశ్రీ ప్రసాద్ తన అవుట్‌పుట్ ఇచ్చేవరకు సినిమా విషయంలో టెన్షన్ తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సంగీత దర్శకులు రీ-రికార్డింగ్ లేట్ చేయడంతో కొన్నిసార్లు సినిమాలు వాయిదాలు వేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేవిశ్రీ ప్రసాద్ ఏం చేస్తాడో చూడాలి.