అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘జాతిరత్నాలు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించింది. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సాధారణ ప్రేక్షకులు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ‘జాతిరత్నాలు’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రేక్షకులతో పాటు సెలెబ్రిటీలు సైతం సినిమాపై పొగడ్తల వర్షం కురిపించారు. తాజాగా తెలంగాణ మంత్రి కేటిఆర్ ‘జాతి రత్నాలు’ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. నిన్న సినిమాను వీక్షించిన కేటిఆర్ ‘జాతిరత్నాలు’ నచ్చిందని, కామెడీ హిలేరియస్ గా ఉందని కితాబిచ్చారు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ కన్పించడం ప్రేక్షకులకు కిక్ ఇచ్చింది. కాగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రం ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్‌పై మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపించింది.
Loved Jathi Rathnalu. Was hilarious 😆 https://t.co/8UwRkxpzmg
— KTR (@KTRTRS) April 11, 2021