Anasuya NCC Teacher Comments: సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు జబర్దస్త్ లాంటి కార్యక్రమంతో ఆమె మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా ఎనలేని గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ అనసూయ అంటే తెలియని తెలుగు వారు ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తాజాగా ఆమె తాను చదువుకునే రోజుల్లో ఏం జరిగిందనే విషయాలను వెల్లడించింది. అసలు విషయం ఏమిటంటే అనసూయ జడ్జిగా ఇప్పుడు స్టార్ మా లో ఒక ప్రోగ్రాం నడుస్తోంది. కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ అనే షోలో ఆమె అమ్మాయిల టీంకి సపోర్ట్ చేస్తున్నట్లు కనిపిస్తూనే జడ్జిగా వ్యవహరిస్తోంది. తాజాగా ఈ షో నిర్వాహకులు అనసూయ చదువుకునే రోజుల్లో ఎన్సీసీ ట్రైనింగ్ ఆఫీసర్ అయిన ఒక ఆమెను తీసుకొచ్చారు.
Darshan: దర్శన్ మెడకు రేణుకాస్వామి హత్యకేసు.. పక్కా ఆధారాలు లభ్యం?
నిజానికి అనసూయ తన భర్త సుశాంక్ భరద్వాజ్ తో ఇలాంటి ఎన్సిసి క్యాంపు లోనే ప్రేమలో పడి పెళ్లి దాకా వెళ్ళామని ఎప్పుడూ చెప్పేది. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఆ ఎన్సిసి ఆఫీసర్ అప్పటి విషయాలు గుర్తు తెచ్చుకున్నారు. అప్పట్లో అనసూయ చాలా అందంగా ఉండేది, అందుకే ఆమె అబ్బాయిల కంటపడకుండా దాచేదాన్ని. ఆమెకు ఎవరు లైన్ వేస్తారో అని భయం ఉండేదని అని అన్నారు. అయితే ఎన్సిసి క్యాంపు లోనే సుశాంక్ ని అనసూయ ప్రేమించారట కదా అని అడిగితే అవును వాళ్ళిద్దరినీ విడదీయడానికి నేను అనేక ప్రయత్నాలు చేశాను అంటూ ఆమె పేర్కొన్నారు. ఇక అనసూయ కూడా ఈ మేడమ్ ఉండబట్టే ఆ రోజుల్లో నేను సుశాంక్ ఒక ఫోటో కూడా కలిసి దిగలేకపోయామని చెప్పుకొచ్చారు. ఇక చాన్నాళ్ల తర్వాత కలిసిన తన ఎన్సిసి టీచర్ ని అనసూయ సన్మానించారు.