C/O కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి విభిన్న సినిమాల నటి, నిర్మాత ప్రవీణ పరుచూరి. నిర్మాతగా రెండు సినిమాలు నిర్మించిన ప్రవీణ ఇప్పడు దర్శకురాలిగా మారింది. ఆమె దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ బ్యానర్ లో రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పణలో ఈ ప్రాజెక్టును నిర్మించింది. మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నేడు విడుదల కాబోతున్న ఈ సినిమాను మూడు రోజుల ముందుగా ప్రీమియర్ షో ప్రదర్శించారు.
C/O కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాలు చేసిన ప్రవీణ నుండి సినిమా అనగానే మంచి బజ్ వచ్చింది. రొటీన్ రెగ్యులర్ సినిమా అయితే కాదు అనే భావన కలిగింది. అదే భావనతో వెళ్లి థియేటర్ లో కూర్చున్న ఆడియెన్స్ కు తాము అనుకున్నది తప్పు అని సినిమా స్టార్ట్ అయినా కొద్ది సేపటికే అర్ధం అవుతుంది. ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ కాస్త నవ్వులు పూయించిన రిమైనింగ్ చెప్పుకోవడానికి ఏమి ఉండదు. ఇక సెకండ్ హాఫ్ లోవచ్చే బైక్,ఆత్మ, టెంపుల్ వంటి అంశాలు ఇంట్రెస్టింగ్ అనిపించినా ఆసక్తికరంగా మలచడంలో తడబడ్డారు. లీడ్ రోల్స్ కాస్త తెలిసిన ఫేస్ లు అయితే బాగుండేది. C/O కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాలలో లీడ్ రోల్స్, సపోర్టింగ్ ఆరిస్టులు కొత్తవారైనా అద్భుతమైన నటనతో మెప్పించారు. కానీ ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన మనోజ్ చంద్ర అంతగా మెప్పించలేదు. కమిడియన్ ఫణి కాస్త నవ్వించాడు. మణిశర్మ నేపధ్యసంగీతం పర్లేదు. మొత్తం మీద ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’.. టాలీవుడ్ లో ఒకప్పుడు ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి అనేలా ఉంది.