టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న కోట ఈ తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. కోటా శ్రీనివాసరావు దాదాపు 750కు పైగా సినిమాల్లో నటించారు. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. తనదైన నటనతో తండ్రిగా, తాతగా, రాజకీయ నాయకుడిగా ఇలా ఎన్నో పాత్రలు పోషించి మెప్పించారు. తన నటనతో విలనిజానికి కొత్త అర్థం చెప్పాడు కోట శ్రీనివాసరావు. సినీ రంగంలో అగ్ర స్థానంలో కొనసాగుతున్న రోజుల్లో కోట రాజకీయ రంగప్రవేశం చేసారు.
మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ ఒత్తిడితో రాజకీయాల్లోకి వచ్చారు. స్వతహాగా వాజ్‌పేయి అంటే చాలా ఇష్టం. అయితే అప్పట్లో సినీనటులు ఎక్కువగా తెలుగుదేశం మరియు కాంగ్రెస్ మద్దతుదారులుగా ఉండేవారు. కానీ ఆ రెండు పార్టీలు కాదని 1990ల్లో బీజేపీలో చేరి 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి చవిచూసిన కోట రాజకీయాల నుండి విరమించుకుని మళ్ళీ నటనలోనే కొనసాగారు. ఆ తర్వాత వందల సినిమాల్లో నటించి 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.
Also Read : Kota SrinivasRao : కోట శ్రీనివాసరావుకు సినీ, రాజకీయ ప్రముఖుల ఘన నివాళి