మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు కొరటాల కాంబినేషన్ లో ‘ఆచార్య’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, మెగా పవర్ స్టార్ చరణ్ సరసన పూజా హెగ్డే జోడీగా నటిస్తుంది. ఈ సినిమాలో ‘సిద్ధా’ పాత్రలో చరణ్ కనిపించనున్నారు. అయితే చరణ్ నిడివి ఉంటుందనీ, జస్ట్ గెస్ట్ రోల్ అనే టాక్ వచ్చింది. అయితే తాజాగా కొరటాల మాట్లాడుతూ.. ఈ సినిమాలో చరణ్ చేస్తున్నది గెస్ట్ రోల్ కాదని, ఆయన పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. సెకండాఫ్ అంతా కూడా చరణ్ పాత్ర కనిపిస్తూనే ఉంటుంది. ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని దర్శకుడు కొరటాల తెలిపారు. ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.