సినిమాల రిలీజ్ విషయంలో పోటీ అనేది సహజంగా ఏర్పడేది. మరి ముఖ్యంగా హాలిడే వంటి సందర్భాలలో ఆ పోటీ కాస్త ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తుంది. తెలుగులో ఆగస్టు 15న 5సినిమాలు పోటీ పడుతుండగా తమిళ్ ఇండస్ట్రీలో 3 సినిమాల మధ్య పోటీ నెలకొంది. పబ్లిక్ హాలిడే కావడంతో పాటు లాంగ్ వీకెండ్ కలిసి రావడంతో విడుదలకు సినిమాలు క్యూ కట్టయి. థియేటర్ల కేటాయింపు వ్యవహారం డిస్ట్రిబ్యూటర్లకు కాస్త తలనొప్పిగా మారింది.
Also Read : Tollywood : పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ‘అల్లూ’ కార్యక్రమం.. ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో..?
ఇండిపెండెన్స్ డే కానుకగా రానున్న భారీ చిత్రం ‘తంగలాన్’. చియాన్ విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో కోలార్ గోల్డ్ కథ నేపథ్యంలో తెరక్కడం, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టూడియో గ్రీన్ నిర్మించిన తంగలాన్ కు ఎక్కువ థియేటర్లు దొరికే అవకాశం ఉంది. ఇక మరొక చిత్రం రఘుతాత. కీర్తి సురేష్ లీడ్ రోల్ లో రానున్న ఈ చిత్రాన్ని KGF, కాంతార వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించిన హోంబాలే ఫిల్మ్స్ నిర్మించింది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాపై ఓ అంచనాలు బానే ఉన్నాయి. ఇక ఇదే రేస్ లో నిలిచినా మరో చిత్రం డెమోంటే కాలనీ-2 గతంలో వచ్చిన డెమోంటే కాలనీ సూపర్ హిట్ కావడంతో ఈ సిక్వెల్ పై అంచనాలు ఉన్నాయి. వీటితో పాటు తెలుగు సినిమ ఇస్మార్ట్ శంకర్, మిస్టర్ బచ్చన్ తమిళ్ లోను విడుదల కానుందండంతో పోటీ నెలకొంది. మరి ఆగస్టు 15న ఏ చిత్రం సూపర్ హిట్ సాధిస్తుందో చూడాలి.