బాహుబలి రేంజ్ ఎక్స్ పర్టేషన్స్‌తో వచ్చిన కంగువా బాక్సాఫీసు దగ్గర బోల్తా పడింది. 400 కోట్లు పెట్టి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం తీస్తే జస్ట్ బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇండియన్ 2, వెట్టియాన్ రిజల్ట్స్ ఏంటో తెలుసు. కానీ ఏ మాత్రం ఎక్స్ పర్టేషన్స్ లేకుండా వచ్చిన తక్కువ బడ్జెట్ చిత్రాలు కొన్ని బాక్సాఫీసు దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించాయి. కర్ణన్, మామన్నన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన మారి సెల్వరాజ్ వాజై జస్ట్ 5 అంటే 5 కోట్లు పెట్టి మూవీ తీస్తే రూ. 40 కోట్లను కొల్లగొట్టింది. ఇదే కోవలోకి వస్తుంది లబ్బర్ పందు. జెర్సీలో నాని కొడుకుగా కనిపించిన హరీష్ కళ్యాణ్ హీరో. తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ. 5 కోట్లతో నిర్మిస్తే.. రూ. 44.36 కోట్లు తెచ్చి రాబట్టింద
Also Read : Allu Arjun : పుష్ప-2 సెన్సార్ రిపోర్ట్ ఇదే.. ఇక థియేటర్స్ లో జాతరే.!
రజనీకాంత్ లాంటి స్టార్ హీరో మూవీ ఉన్నా.. రిస్క్ చేసి హిట్టు అందుకుంది లవర్. లాల్ సలాంకు గుడ్ బై చెప్పి లవర్‌కు వసూళ్లు కుమ్మరించారు ఆడియన్స్. విజయ్ సేతుపతి నటించిన మహారాజా ఈ ఏడాది స్మాల్ బడ్జెట్ చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. రూ. 20 కోట్లతో మహారాజా తీస్తే రూ.110 కోట్లను రాబట్టింది. ఇప్పుడు చైనాలో కూడా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. డీమాంటీ కాలనీ2. జస్ట్ 15 నుండి 20 కోట్లలోపే దీని బడ్జెట్.. కానీ 85 కోట్ల వరకు రాబట్టగలిగింది. 40 కోట్లతో తీసిన అరణ్మనై 4 కూడా సుమారు వంద కోట్లను వసూలు చేసింది. ఇవన్నీ కూడా మినిమం బడ్జెట్ సినిమాలే. అమరన్ కాస్త బిగ్ బడ్జెట్ చిత్రమైనప్పటికీ ఇప్పటికే రూ. 300 కోట్లు దాటేసింది. స్టార్ హీరోల కంటే కుర్ర హీరోల సినిమాలే కోట్లు కుమ్మరించి తమిళ ఇండస్ట్రీని నిలబెట్టిన చిత్రాలుగా మారాయి