కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా దిశా పటాని హీరోయిన్ గా వస్తోన్న చిత్రం “కంగువా”. మాస్ యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించబోతున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రానుంది కంగువ, ఇప్పటిదాకా ఇండియన్ తెరపై రాని కొత్త కాన్సెప్ట్‌తో దర్శకుడు శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కంగువ పది భాషల్లో రానుంది. సూర్య కెరీర్ లోనే ప్రతిష్టాత్మక సినిమాగా కంగువ రానుంది. స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read: Kollywood : ఆగస్టు 15న సినిమాల రిలీజ్ విషయంలో తమిళంలోనూ తీవ్ర పోటీ..
కంగువను రెండు భాగాలుగా తీసుకు వస్తున్నారు నిర్మాతలు. మొదటి పార్ట్ ను దసరా కానుకగా అక్టోబర్ 10 విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ర్మాత కేఈ జ్ఞానవేల్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కంగువ కంటెంట్ గురించి ఎవరికీ తెలియదు కాబట్టి మొదటి భాగం వచ్చే రోజు పోటీగా మరికొన్ని సినిమాలు విడుదల అవుతున్నాయి. కానీ కంగువ ఎంతటి హిట్ అవుతుందో మీర్ ఊహించలేరు. ఈ నేపథ్యంలో ‘కంగువ2’తో మాత్రం ఎవ్వరూ పోటీకి రాలేరు. అసలు పోటీకి వచ్చే దైర్యం ఎవరూ చేయలేరు. ఈ విషయాన్ని నమ్మకంతో చెబుతున్నాను. సినిమా కంటెంట్ అంత బలమైనది” అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్స్ సెటైర్స్ పేలుస్తున్నారు. దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో కంగువ చిత్రాన్ని తెరకెక్కించారు. టాలీవుడ్ లో దేవర పార్ట్-1తో పోటీగా విడుదలవుతుంది కంగువ. మరి కంగువ పై నిర్మాత చేసిన వ్యాఖ్యల వస్తావం తెలియాలంటే దసరా వరకు వేచి చూడాలి.