మణిరత్నం, శంకర్ పని అయిపోవడంతో కోలీవుడ్‌ను నిలబెట్టే బాధ్యతను తీసుకున్నారు కార్తీక్ సుబ్బరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్, లోకేశ్ కనగరాజ్, అట్లీ. జవాన్ నుండి అవుట్ ఆఫ్ ది బాక్స్‌గా మారిపోయాడు అట్లీ. ఈ త్రయంలో నెల్సన్, లోకీ సక్సెస్ ట్రాక్‌లో ఉన్నారు. కార్తీక్ మాత్రం రెట్రోతో ప్లాప్ చవిచూశాడు. ఈ విషయం పక్కన పెడితే ఈ ముగ్గురు నెక్ట్స్ తమిళ తంబీలపై కన్నా తెలుగు ఆడియన్స్‌పై ఫోకస్ చేస్తున్నారట. ఇప్పటికే నెల్సన్ దిలీప్ కుమార్ టాలీవుడ్ తెరంగేట్రానికి సిద్దమయ్యాడు. తారక్‌ను డీల్ చేయబోతున్నాడన్నది గట్టి బజ్. జైలర్2 తర్వాత ఈ సినిమా ఉండొచ్చని టాక్.
Also Read : Pushpa3 : పుష్ప పార్ట్ 3.. రూమర్స్ కు చెక్ పెట్టిన సుకుమార్
రెట్రో దెబ్బకు స్టార్ హీరో లెవరూ కార్తీక్ సుబ్బరాజుకు ఛాన్స్ ఇవ్వడం లేదు. నాని, హారీష్ కళ్యాణ్- నివిల్ పౌలీ పేర్లు వినిపించాయి కానీ వర్కౌట్ కాలేదు. చేసేది లేక స్వతంత్ర ఫిల్మ్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు. అయితే దర్శకుడిగా కాస్త బ్రేక్ ఇచ్చి నిర్మాతగా అందులోనూ తెలుగులో బిజీ కావాలనుకుంటున్నాడట. ఇప్పటికే స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యానర్ పై పలు చిత్రాలు, సిరీస్ తెరకెక్కించిన కార్తీక్ నెక్ట్స్ టాలీవుడ్‌లో మూడు సినిమాలు ప్లాన్ చేస్తున్నాడట. అందులో ఓ ప్రాజెక్టులో వైష్ణవ్ తేజ్ హీరోగా చేస్తున్నాడన్నది కోలీవుడ్ టాక్. ఇప్పటికే అమ్ము అనే స్ట్రైట్ తెలుగు మూవీ నిర్మించాడు కార్తీక్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడిగా, కార్తీక్ సుబ్బరాజు నిర్మాతగా టాలీవుడ్‌పై దండయాత్ర షురూ చేస్తున్నారు. ఇక మిగిలింది లోకేశ్ కనగరాజే. ఇప్పటికే నాగార్జున లాంటి స్టార్ హీరోను పట్టుకెళ్లి విలన్ చేసిన లోకీ ఇక తెలుగులో సినిమా చేయడమే ఆలస్యం. అటు వెట్రిమారన్ కూడా తారక్ తో సినిమా చేసే ప్లానింగ్ లో ఉన్నాడు.
