Kollywood: 1000 క్రోర్ లెక్కలు తేల్చేది ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ లో 1000 క్రోర్ ఓ అందని ద్రాక్ష. బాలీవుడ్ మినహా మిగిలిన మెయిన్ ఇండస్ట్రీస్ 1000 కోట్లు కొల్లగొడుతుంటే, తమిళ ఇండస్ట్రీకి ఓ టార్గెట్ లా ఊరిస్తోంది. ఇప్పటివరకు 1000 కోట్ల మార్కుకు దగ్గరగా వచ్చిన కోలీవుడ్ హీరో రజినీకాంత్ ‘రోబో 2.0’ తో 800 కోట్లు టచ్ చేశాడు. ఇప్పుడు తలైవా అందుకోవాల్సింది 1000 కోట్ల టార్గెట్. దానికి తగ్గట్టే ఈ వయసులో కష్టపడుతున్నారు సూపర్ స్టార్. గత ఏడాది ‘కూలీ’తో కవర్ చేద్దాం అనుకుంటే లోకేష్ కనకరాజ్ నమ్మకాన్ని వమ్ము చేశాడు. ఇక తలైవా ఆశలన్నీ నెల్సన్ దిలీప్ కుమార్ ‘జైలర్ 2’ మీదే. ఈ సినిమాతో సరికొత్త రికార్డ్స్ చేయాలని ట్రై చేస్తున్నారు సూపర్ స్టార్. ఈ ఏడాది అక్టోబర్ 15న దసరాను టార్గెట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఓటిటి రైట్స్ 160 కోట్లకు అమ్ముడయ్యాయని టాక్.
‘లియో’తో 500 క్రాస్ చేసిన దళపతి విజయ్ ‘జననాయగన్’తో 1000 క్రోర్ మార్కెట్ టచ్ చేస్తాడు అనుకుంది కోలీవుడ్. కానీ సెన్సార్ ఇష్యూస్ ఓ పట్టాన తెగడం లేదు. ఇంకేముంది ఏ సర్టిఫికేట్ జారీ అయిపోయింది, ఈ నెలలోనే రిలీజ్, బాక్స్ ఆఫీస్ ఊచకోత అని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్న వేళ బాంబ్ పేల్చింది కేవిఎన్. అదంతా ఫేక్ అని, ఇంకా సెన్సార్ సవరణలు చెప్పిందంటూ తేల్చేసింది. అయితే ఈ సినిమా థియేటర్స్ లోకి వస్తే ఆడియన్స్ చూస్తారా అంటే చెప్పలేం. ఎందుకంటే సినిమా మొత్తం లీక్ అయి పెద్ద షాక్ ఇచ్చింది. విజయ్ పొలిటికల్ ఎంట్రీ లేకపోతే ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్ లో 1000 క్రోర్ కొల్లగొట్టే హీరో అని కచ్చితంగా అంచనాలు వేయొచ్చు, కానీ ఆ సిచువేషన్ కనిపించడం లేదు. జననాయగన్ ఒకవేళ థియేటర్స్ లో వచ్చినా 1000 క్రోర్ కొల్లగొట్టడం కష్టమే అంటున్నారు తమిళ తంబీలు.
Also Read
ఈ ఏడాది భారీ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్లు ఉన్నాడు సూర్య. ‘కంగువ’ రెట్రో లెక్కలు ‘కరుపు’తో కాస్త కవర్ చేశాడు. మిక్స్డ్ టాక్ తోనే 350 కోట్లు కొల్లగొట్టాడు. రెస్పాన్స్ బాగా వచ్చి ఉంటే 500 కోట్లు అచీవ్ చేసేవాడని అంటోంది కోలీవుడ్. నెక్స్ట్ బైలింగ్వల్ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తో బిగ్ నెంబర్ టార్గెట్ చేస్తున్నాడు. ఆ మ్యాజిక్ నెంబర్ సూర్య అచీవ్ చేయగలడా అంటే, కోలీవుడ్ లో మాత్రమే కాదు బాలీవుడ్, టాలీవుడ్ లో కూడా సూర్యకు ఉన్న క్రేజ్, మార్కెట్ కు ఈ నెంబర్ సాధ్యమే అంటున్నారు క్రిటిక్స్. కనీసం 500 క్రోర్ టచ్ చేయొచ్చని అంచనా. మరి 1000 క్రోర్ టార్గెట్ అచీవ్ చేసే ఫస్ట్ హీరో ఎవరవుతారో, లేక ఈ ఏడాది కూడా కోలీవుడ్ కు 1000 కోట్లు కలగానే మారుతుందో వెయిట్ అండ్ వాచ్ ఇట్!
తాజావార్తలు
-
Kollywood: 1000 క్రోర్ లెక్కలు తేల్చేది ఎవరు?
-
TMC Crisis: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. రూ. 440 కోట్లు ఫ్రీజ్..
-
Fauzi Shoot: షాకింగ్ : ఫౌజీ షూటింగ్లో నటుడ్ని కాటేసిన విష పురుగు?
-
Anil Kumble: “భారత్ పూర్తిగా లొంగిపోయింది”.. టీమిండియా ఘోర పరాజయంపై మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Lenin : లెనిన్’తో నాలుగు డబ్బింగ్ సినిమాల పోటీ!
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..