ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ ‘జూనియర్’తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా జూలై 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ బెంగళూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
Also Read:Narendra Modi: కోట శ్రీనివాసరావు గుర్తుండిపోతారు!
ఈ క్రమంలో గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసి చిత్ర బృందాన్ని ఆశీర్వదించిన డాక్టర్ శివరాజ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ సినిమాలో రవిచంద్రన్ గారు, కిరీటి నటించిన సీన్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించిన జెనీలియా గారు ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. వారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ పాత్ర దేశం మొత్తం అభిమానిస్తుంది. బాహుబలి లాంటి అద్భుతమైన సినిమాలకు పనిచేసిన కెమెరామెన్ సెంథిల్ కుమార్ గారు ఈ సినిమాకి పనిచేయడం కిరీటి అదృష్టం. నేను సాయి గారు కర్ణాటకలో ఒకే స్కూల్లో చదువుకున్నాం. వారాహి బ్యానర్ తో ఆయన దేశవ్యాప్తంగా చాలా అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
Also Read: Ahmedabad Plane Crash: పైలట్‌పై తీవ్ర ఆరోపణలు.. ఖండించిన పైలట్ సంఘాలు
కిరీటి చిన్న వయసులో ఉన్నప్పుడే తనతో సినిమా చేస్తానని ఆయన చెప్పడం గొప్ప ఆశీర్వాదం. శ్రీ లీల నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తను దేశవ్యాప్తంగా చాలా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటున్నారు .పునీత్ రాజ్ కుమార్ గారి ఆశీస్సులు కిరీటిపై ఉన్నాయి. జేమ్స్ సినిమా సమయంలో కిరీటికి ఆయనతో సమయాన్ని గడిపే అదృష్టం దక్కింది. కిరీటికి చిన్నప్పటినుంచి యాక్టింగ్ డాన్సింగ్ అంటే ఇష్టం. తను ఒక పాషన్ తోనే ఈ పరిశ్రమలోకి వస్తున్నాడు. కిరీటిపై అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. చాలా మంచి సినిమా ఇది. మన ఇంట్లో జరిగే కథలాగా ఉంటుంది. తప్పకుండా సినిమాని చూసి మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను’అన్నారు.