సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ మరోసారి మాస్ అవతారంతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కింగ్డమ్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియోలు సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేశాయి.
Also Read : ‘F1’ : సౌత్ బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేసిన F1..
అయితే ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు విడుదల అవుతుందనే అంశంపై గత కొన్ని రోజులుగా సందిగ్ధత నెలకొనగా, తాజాగా జూలై 25న ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో బలమైన సమాచారం వెలువడుతోంది. ఈ వార్త అధికారికారికంగా ప్రకటన రానప్పటికి.. ఇదే కనుక నిజమైతే విజయ్ దేవరకొండ అభిమానులకు ఇది ఒక సాలిడ్ ట్రీట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రముఖ బ్యానర్లు సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో, కథానాయకుడికి పవర్‌ఫుల్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో పాటు ఎమోషనల్ డెప్త్ కూడా ఉండేలా ఈ చిత్రం రూపొందుతోందని టాక్. ఈ సారి ఎలా అయిన ‘కింగ్‌డమ్’ ద్వారా మళ్లీ మాస్ హిట్ కొట్టాలనే పట్టుదలతో విజయ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ట్రైలర్ విడుదలతో సినిమా హైప్ మరింత పెరిగేలా ఉంది.