హాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్నాయి. ప్రత్యేకంగా జేమ్స్ గన్ తెరకెక్కించిన ‘సూపర్ మ్యాన్’ చిత్రం, గ్లోబల్‌గా భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ మూవీ ఇప్పటివరకు రూ.3,498 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో కూడా ఈ చిత్రం మంచి స్పందన పొందుతూ, కేవలం 8 రోజుల్లోనే రూ.37 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.
Also Read : Ramayana: రాముడిగా సల్మాన్ ఖాన్.. 40 శాతం షూటింగ్ ఫినిష్ కానీ..
ఇక మరోవైపు, డైనోసార్ ఫ్రాంచైజీకి కొనసాగింపుగా వచ్చిన ‘జురాసిక్ వరల్డ్: రీబర్త్’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.5,583 కోట్లు వసూలు చేయడం గమనార్హం. విజువల్ ఎఫెక్ట్స్, థ్రిల్లింగ్ నరేషన్‌తో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది.
అలాగే, స్టార్ హీరో బ్రాడ్ పిట్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘F1’ (ఫార్ములా వన్ రేసింగ్ నేపథ్యంలో రూపొందిన చిత్రం) ఇప్పటివరకు రూ.3,970 కోట్లు వసూలు చేయడం మరొక హైలైట్. స్పోర్ట్స్ డ్రామాలో యాక్షన్, ఎమోషన్ మిళితం చేసిన విధానం ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేసిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ మూడు చిత్రాల కలెక్షన్ ఫిగర్లు చూస్తుంటే, హాలీవుడ్ సినిమాల ప్రభావం గ్లోబల్ స్థాయిలో ఎలాంటి మైలురాళ్లు చేరుతోందో స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఇండియన్ మార్కెట్‌లో కూడా హాలీవుడ్ సినిమాలకు బలమైన స్థానం ఏర్పడుతున్నట్లు ఈ వసూళ్లే నిదర్శనం.