‘ఖడ్గం, మగధీర’ లాంటి చిత్రాల్లో తళుక్కున మెరిసిన కిమ్ శర్మ గుర్తుందా? 2006 తరువాత ఆమె పెద్ద తెర, చిన్న తెర ఎక్కడా కనిపించటం లేదు. అయితే, సొషల్ మీడియాలో మాత్రం ఖాళీగా లేదు. ఫాలోయర్స్ ని కూడా సైలెంట్ గా ఉండనివ్వటం లేదు. ఇన్ స్టాగ్రామ్ లో ఇన్ స్టాంట్ గా ఇంట్రస్ట్ క్రియేట్ చేసే పోస్టులు పెడుతోంది. అందుక్కారణం, ఆమె చాలా రోజులుగా రహస్యంగా సాగిస్తోన్న రొమాన్సే!
టెన్నిస్ ఛాంపియన్ లియాండర్ పేస్ తో కిమ్ శర్మ ప్రస్తుతం లవ్ ఎఫైర్ నడుపుతోందట. ఆమె ఇంకా అఫీషియల్ గా అంగీకరించలేదుగానీ అప్పుడప్పుడూ ఇన్ స్టా పోస్టులు పెడుతూ హింట్స్ బాగానే ఇస్తోంది. ఆ మధ్య గోవాలో తీసుకున్న ఫోటో పెట్టి ‘మిష్టర్ పీ’ అంటూ పేర్కొంది. అతడు ‘పేసే’ అంటున్నారు నెటిజన్స్. ఇక ఈ మధ్య అయితే కాస్త డైరెక్ట్ గానే పిక్స్ అప్ లోడ్ చేస్తోంది కిమ్. తాను, లియాండర్ కలసి ఉన్న కొన్ని ఫోటోలు ఆమె జనంలోకి వదలటం, అవి వైరల్ కావటం చకచకా జరిగిపోయాయి. అయితే, రీసెంట్ గా మరో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది బాలీవుడ్ బ్యూటీ…
“కంగ్రాచ్యూలేషన్స్ ఆన్ 25 ఇయర్స్ ఆఫ్ యువర్ ఒలంపిక్ మెడల్ ఛాంప్” అంటూ లియాండర్ పేస్ ని ట్యాగ్ చేసింది కిమ్ శర్మ. 1996లో లియాండర్ అట్లాంట ఒలంపిక్స్ లో కాంస్య పతకం సాధించాడు! టెన్నిస్ లో ఒలంపిక్ మెడల్ సాధించిన ఏకైక భారతీయ ఆటగాడు ఆయనే కావటం విశేషం! అందుకే, కిమ్ తన ప్రియుడి పాతికేళ్ల కిందటి విజయాన్ని ప్రియాతి ప్రియంగా జ్ఞాపకం చేసుకుంటూ పోస్ట్ పెట్టింది! చూడాలి మరి, మన ఒలంపిక్ బ్రాంజ్ మెడలిస్ట్ కిమ్ తో వ్యవహారాన్ని అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తాడో…
