బాలీవుడ్‌లో మరోసారి ఒక గౌరవనీయమైన బయోపిక్ ప్రాజెక్ట్ తెరకెక్కబోతుంది. అలనాటి నటీమణి మీనా కుమారి గురించి పరిచయం అక్కర్లేదు. ‘బైజుబాన్రా’, ‘పాకీజా’ లాంటి క్లాసిక్ చిత్రాలతో చిత్ర పరిశ్రమలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుంది మీనా కుమారి. కానీ ఆమె జీవితంలో ఉన్న భావోద్వేగాలు, బాధలు, కీర్తి, ప్రేమ ఇవన్నీ వెండితెరపై మరోసారి ప్రతిభావంతంగా ఆవిష్కరించేందుకు బాలీవుడ్ సిద్ధమవుతోంది. ఈ భారీ బయోపిక్‌ను ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించబోతున్నారు. ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన మార్క్ వేసిన మనీష్, ఇప్పుడు సినిమాలు తెరకెక్కించేందుకు నడుం బిగిస్తున్నాడు. ఆయన తొలి చిత్రమే ‘మీనా కుమారి’ బయోపిక్ కావడం విశేషం.
Also Read : Trisha : మహేశ్ బాబుతో నటించేటప్పుడు కాస్త గిల్టీగా ఫీల్ అయ్యా..
ఇక తాజా సమాచారం ప్రకారం ఈ బయోపిక్‌కి కియారా అడ్వాణీనే కథానాయికగా ఎంపిక చేశారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మీనా కుమారి పాత్రలో నటించేందుకు చాలా మంది హీరోయిన్‌లు ఆసక్త చూపినా, ఆ పాత్రకి అవసరమైన భావోద్వేగం, విలువ, గంభీరత కియారా నుంచే రావచ్చని చిత్ర బృందం నమ్ముతోందట. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు ముగింపు దశలో ఉన్నాయి. అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందని కియారా సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
మీనా కుమారి పాత్ర – ఒక ఎమోషనల్ ఎగ్జామినేషన్
మీనా కుమారి జీవితమే ఒక కళాత్మక గాథ. చిన్న వయసులో రంగప్రవేశం, అద్భుత నటన, గందరగోళమైన వ్యక్తిగత జీవితం, ప్రేమలో పరాజయం, వేదనలతో కూడిన ఓ విషాద కథ. ఈ పాత్రలో నటించడానికి ఒక నటీమణికి విశేషమైన లోతు, అభినయ పటిమ అవసరం.. అలాంటీ మీనా కుమారి పాత్రలో కియారా అద్వాణీ ఎంపిక కావడం అంటే ఒక రిస్క్, కానీ అదే సమయంలో ఒక గౌరవం కూడా. ఈ బయోపిక్‌కు సంబంధించి అన్ని విషయాలు క్లియర్‌గా వెలువడితే, ఇది కేవలం కియారాకు మాత్రమే కాదు, బాలీవుడ్‌కి కూడా ఒక ఎమోషనల్గా నిలిచే అవకాశం ఉంది. మీనా కుమారి జీవితాన్ని తెరపైకి తీసుకు రావడం అంటే ఒక కళాత్మక సాహసం. అది కియారా చేతులు మీదకు రావడం అంటే ఆమెపై పెట్టిన నమ్మకాన్ని తెలియజేస్తుంది.