ఈ సంవత్సరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో “కేజీఎఫ్ చాప్టర్ 2” ఒకటి. ‘కేజీఎఫ్’కి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కేజీఎఫ్-1 కంటే కేజీఎఫ్-2 ఇంకా ఆసక్తికరంగా ఉంటుందని చెప్పి భారీగా అంచనాలను పెంచేశారు. బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్లతో పాటు సినిమాలో భారీ తారాగణం ఉంది. ‘కేజీఎఫ్ 1’ సీక్వెల్ ‘కేజీఎఫ్ : చాప్టర్ 2’కు కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఈ వంటి పాన్ ఇండియన్ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో విడుదల కానుంది. ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదల కావాల్సి ఉంది. కానీ మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఇటీవలే కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా నుంచి త్వరలో సర్ప్రైజ్ రానుందన్న వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది.
Read Also : పెళ్ళి వార్తలపై క్లారిటీ ఇచ్చేసిన త్రిష
జూలై 29 న సినీ పరిశ్రమలో ‘బాబా’ అని ప్రేమగా పిలువబడే సంజయ్ దత్ 62వ పుట్టినరోజు. తాజా సమాచారం ప్రకారం సంజయ్ దత్ పుట్టినరోజున ‘కేజీఎఫ్ 2’ బృందం అభిమానుల కోసం ట్రీట్ ప్లాన్ చేస్తోంది. అయితే సినిమా నుంచి టీజర్, లేదా పోస్టర్ ను రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ‘కేజీఎఫ్ : చాప్టర్ 2’లో విలన్ పాత్ర పోషిస్తున్న సంజయ్ దత్ కు సౌత్ లో ఇదే మొదటి చిత్రం. ఈ చిత్రంలో సంజయ్ ‘అధీరా’ పాత్రలో కనిపించనున్నారు. యష్, సంజయ్ దత్ భారీ యాక్షన్ సన్నివేశం ఉందని, ఇది ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని అంటున్నారు.