Monalisa : సిపిఎం అగ్రనేతలకు మోనాలిసా ‘పోక్సో’ సెగ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక ప్రేమ వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య నడుస్తున్న ఈ హైడ్రామాలో కేరళ గత టర్మ్ అధికార కమ్యూనిస్ట్ పార్టీ (CPI-M) అగ్రనేతలు, ఏకంగా ఒక రాష్ట్ర మంత్రి చట్టపరమైన ఇబ్బందుల్లో పడేలా కనిపిస్తున్నారు. పూసల మోనాలిసా పెళ్లి సమయానికి మైనర్ అనే ఆరోపణలు రావడం, దీనిపై జాతీయ ఎస్టీ కమిషన్ (NCST) రంగంలోకి దిగడంతో ఈ వ్యవహారం ముదిరి పాకాన పడింది. మొనాలీసా భోస్లే, ఫర్మాన్ కేరళ మ్యారేజ్ రూల్స్ ప్రకారం వివాహం చేసుకున్నారు. అయితే, పెళ్లి సమయానికి మొనాలీసా వయస్సు కేవలం 16 సంవత్సరాలేనని, ఆమెకు చట్టబద్ధంగా వివాహ వయస్సు రాలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. బాల్య వివాహమే కాకుండా, ఇందులో ‘పోక్సో’ చట్టం కింద నేరం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవడంతో ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. దీనిపై మధ్యప్రదేశ్ లో సదరు యువతి తండ్రి ఫిర్యాదు చేయడంతో కిడ్నాప్ కేసు కూడా నమోదైంది.
మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో ఈ దంపతులు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తాము మేజర్లు అయ్యాకే పెళ్లి చేసుకున్నామని నిరూపించడానికి మొనాలీసాకు సంబంధించిన పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, జనన ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్ వంటి కీలక పత్రాలను కోర్టు ముందుంచారు. ఈ ఏడాది జనవరి నాటికే ఆమెకు 18 ఏళ్లు నిండాయని వారు వాదిస్తున్నారు. మొదట్లో తమ పెళ్లికి అమ్మాయి కుటుంబం అంగీకరించిందని, కానీ ఒక బంధువు ఒత్తిడి వల్లే ఇప్పుడు కేసుల వరకు తెచ్చారని వారు తమ పిటిషన్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఈ కేసులో మరో ఊహించని మలుపు తిరిగింది. తనను మైనర్‌గా చూపిస్తూ, తమ పెళ్లిని రద్దు చేయాలనే కుట్రతో అధికారులు తన వయస్సు రికార్డులను తారుమారు చేశారంటూ మొనాలీసా ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టును కూడా ఆశ్రయించడం విశేషం. అయితే ఈ పెళ్లిని దగ్గరుండి జరిపించారనే ఆరోపణలపై కేరళకు చెందిన ప్రముఖ రాజకీయ నేతలపై ప్రైవేట్ ఫిర్యాదు నమోదైంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్, కేరళ విద్యాశాఖ మంత్రి వి. శివన్కుట్టి, రాజ్యసభ ఎంపీ ఏ.ఏ. రహీమ్‌లపై చర్యలు తీసుకోవాలని తిరువనంతపురంలోని పోక్సో కోర్టులో దాఖలైన పిటిషన్లో కోరారు. దీనిపై స్పందించిన కోర్టు.. యువతి వయస్సుపై దర్యాప్తు ఏ స్థితిలో ఉందో నివేదిక ఇవ్వాలని మధ్యప్రదేశ్ పోలీసులను ఆదేశించింది.
Also Read
తాజావార్తలు
-
Ravi Teja : నాకు ఆ హీరోయినే కావాలంటున్నరవితేజ.. మాకొద్దంటున్న ఫ్యాన్స్
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Team India: టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. శ్రీలంక టెస్టు సిరీస్‌కు స్టార్ ప్లేయర్ డౌటే!
-
PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన మొత్తం పెంపుపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ క్లారిటీ.. 24వ వాయిదాకు ముందు కీలక అప్డేట్
-
Dharmendra Pradhan: నీట్‌పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!