ఈ వారం ఆహా ఓటీటీలో మరో సరికొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో మర్డర్ మిస్టరీగా రూపొంది మంచి హిట్‌గా నిలిచిన “యుగి” అనే సినిమా ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్‌కు “కార్తీక మిస్సింగ్ కేసు” అని ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు మేకర్స్. ఈ సినిమాను భవాని మీడియా ఆహాలో రిలీజ్ చేసింది. ఈ సినిమా టైటిల్ రోల్‌లో ఆనంది నటించగా, పవిత్ర లక్ష్మి, ఖాదిర్, జోజు జార్జ్, ప్రతాప్ పోతన్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు.
ALso Read:Air India Plane: లండన్ వెళ్తూ.. వెనక్కి వచ్చేసిన ఎయిర్ ఇండియా విమానం!
2022 నవంబర్‌లో తమిళంలో రిలీజైన ఈ సినిమా అప్పట్లో మంచి మర్డర్ మిస్టరీ సినిమాగా పేరు తెచ్చుకుంది. నిజానికి ఈ సినిమాను తమిళం, మలయాళం భాషలలో ఏకకాలంలో రూపొందించారు. ఈ సినిమా దర్శకుడు ఒక డిటెక్టివ్, తన టీమ్‌తో కలిసి కార్తీక అనే అమ్మాయిని వెతకడానికి వెళ్తాడు. ఈ క్రమంలో కార్తీక గురించి ఆ టీమ్‌కు ఏం తెలుస్తుంది, చివరికి ఆ అమ్మాయిని కనుగొన్నారా లేదా అనే విషయాలు ఆసక్తి రేకెత్తిస్తాయి.