ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిత్రం ‘కాంతార’. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం కన్నడలో చిన్న స్థాయిలో రిలీజై అక్కడ అద్భుత స్పందన తెచ్చుకుంది. దీంతొ తెలుగు, హిందీ, తమిళ భాషల్లోకి కూడా ఈ సినిమాను రిలీజ్ చేశారు. అలా విడుదలైన ప్రతి చోటా సంచలన వసూళ్లతో దూసుకెళ్లింది. ఏకంగా రూ.400 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టింది. ఈ మూవీతో హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి రేంజే మారిపోయింది. పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ వాంటెడ్ హీరో కమ్ డైరెక్టర్ అయిపోయాడు. ప్రస్తుతం ఈ ‘కాంతార’ ప్రీక్వెల్ చిత్రీకరణలో శరవేగంగా జరుగుతున్నప్పటికి తాజాగా ఈ మూవీ రిలీజ్ పై ఓ వార్త వైరల్ అవుతుంది.
Also Read: MAD Square : ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్ కోసం వస్తున్న NTR
ముందు నుండి ఈ చిత్రాని ఈ ఏడాది దసరాకు రిలీజ్ చేయలని అనుకున్నారు. కానీ చత్రీకరణ ఆలస్యం అవుతుండడంతో కాంతార చాప్టర్ 1ను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ ప్రచారంపై చిత్ర బృందం స్పందించింది. ‘కాంతార చాప్టర్ 1 షూటింగ్ సజావుగానే సాగుతోందని.. ముందు ప్రకటించిన ప్రకారమే ఈ ఏడాది అక్టోబరు 2న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని’ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ స్పష్టం చేసిందట. ఇకపోతే ‘కాంతార’ ఉహించని విధంగా హిట్ అవ్వడంతో, కాంతారా ప్రీక్వెల్ ను భారీ బడ్జెట్‌తో ప్రతి సీన్‌ను చాలా జాగ్రత్తగా తీస్తున్నారట. అంతే కాదు ఈ మూవీలో 500 మంది ఫైటర్లు, 3000 మంది ఆర్టిస్టులతో భారీ యాక్షన్ సీన్ ఒకటి చేసినట్టు తెలుస్తోంది. ఈసీన్ సినిమా మొత్తానికి హైలెట్ అవ్వబోతున్నట్టు చెపుతున్నారు. ఈ ఫైటింగ్ సీన్‌ను రీసెంట్‌గా షూట్ చేశారట. మరిని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.