కన్నప్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో బ్రహ్మానందం చేసిన వ్యాఖ్యలు హైలైట్ అవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ జేఆర్సి కన్వెన్షన్ లో ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో పాల్గొన్న బ్రహ్మానందం మాట్లాడుతూ ఈ సినిమా మోహన్ బాబు గారు ఎందుకు చేశాడా అనే ఒకప్పుడు అనుకున్నా. కానీ కన్నప్ప పుట్టినరోజు దగ్గరలోనే పుట్టిన మోహన్ బాబు ఏవేవో సినిమాలు చేస్తుంటే నా సినిమా చేయరా అని ఆ పరమ శివుడే ఆయనను ఆజ్ఞాపించాడేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఉన్న కుర్రవారు అంతట్లో భక్తి సన్నగిల్లిపోయి అరాచకాలు మొదలవుతున్న సందర్భంగా ఏదో ఒక భారతీయ తత్వాన్ని, భారతీయ శివ తత్వాన్ని తెలియపరచాలి అని శివుడే సాక్షాత్తు ఆయనే మోహన్ బాబుని ఎలా రారా అని పిలిచి తన సినిమా తీయమని చెప్పాడు.
Also Read:Samantha : వాళ్ల మాటలు పట్టించుకోవద్దు.. సమంత పోస్ట్
మోహన్ బాబు ఇందాక నడిచి వస్తుంటే సాక్షాత్తు శివుడికి సేవ చేసిన మహాదేవ శాస్త్రి వస్తున్నట్లు అనిపించింది. ఆ కడుపున బిడ్డను బిడ్డ మంచు విష్ణును కన్నప్పగా ఎన్నుకోవడం వెనుక కూడా శివుడి ఆజ్ఞ ఉంది. వారే కాదు ప్రభాస్, మోహన్లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్ వంటి వాళ్లను కూడా శివుడే నటింప చేశాడని బ్రహ్మానందం అన్నారు. కలియుగంలో కలియుగ ప్రభావం చేత పరమ దుర్గార్థమైన ఆలోచనలతో ఉన్న మానవులను కనీసం భక్తి అంటే ఏంటి భక్తి అంటే ఎలా ఉంటుంది అని తెలియ చెప్పడం కోసమే ఈ సినిమా చేశారని అన్నారు. మోహన్ బాబు ఏవైనా సినిమాలు చేస్తే మీరు వదిలేయండి. దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయనను విమర్శించండి, నటనని విమర్శించండి తప్పులేదు. ట్రోలింగ్ చేయండి తప్పులేదు. కానీ భక్తి కోసం, శివతత్వాన్ని పెంపొందించడం కోసం చేసిన ఈ సినిమాని మాత్రం ట్రోల్ చేయకండి. మీ అందరినీ నమ్మ్రతతో నమస్కరించి చెప్పేదేమిటంటే ఈ సినిమాని ఆదరించండి, అభిమానించండి అల్లరి మాత్రం చేయకండి. ఎందుకంటే శివుడు ప్రతి ఇంటా చేరాలి ప్రతి గుండెలోకి చేరాలి ప్రతి మనసుకి చేరాలి అంటూ ఎమోషనల్ అయ్యారు.