ఈ మధ్య కాలంలో కన్నడ చిత్రాలు ఎలాంటి విజయాలు అందుకుంటున్నాయే మనకు తెలిసిందే. ముఖ్యంగా OTT లో బాగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో భాష తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఈ చిత్రాలను ఆదరిస్తున్నారు. ఇందులో భాగంగా కన్నడలో ఇటీవల విడుదలై మంచి స్పందన పొందిన హ్యుమరస్ డ్రామా ‘సు ఫ్రమ్ సో’ ఇప్పుడు తెలుగులోకి రాబోతుంది. ప్రేక్షకుల్ని నవ్వులు పూయించిన ఈ చిత్రాన్ని దర్శకుడు జె.పి. తుమినాడ్ డైరెక్ట్ చేశారు. సోషల్ కామెడీగా సాగిన ఈ సినిమా, వినోదానికి ప్రాధాన్యత ఇచ్చిన కథనంతో బాక్సాఫీస్ వద్ద బారీ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ విజయవంతమైన చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. త్వరలోనే ఈ సినిమాను తెలుగులో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో మల్టీప్లెక్స్ ప్రేక్షకులు, కామెడీ లవర్స్ అందరూ ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షనీల్ గౌతమ్, సంధ్య అరకెరె, జె.పి. తుమినాడ్, రాజ్ బీ శెట్టి వంటి నటులు ప్రధాన పాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి ఇప్పటికే మంచి బజ్ ఏర్పడుతోంది. మరి కన్నడలో విజయాన్ని సాధించిన ఈ ఫీల్ గుడ్ కామెడీ డ్రామా, తెలుగులోనూ అదే స్థాయిలో ఆకట్టుకుంటుందా? అన్నది చూడాల్సిందే.