టాలీవుడ్‌లో సెటిల్ అవ్వాలనుకుంటున్న ఇద్దరు కన్నడ కస్తూరీలు యంగ్ హీరోలతోనే నటించాలన్న బేరియర్స్ చెరిపేస్తున్నారు. సీనియర్ స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు సై అంటున్నారు. రష్మిక ఇచ్చిన స్ఫూర్తితో టాలీవుడ్‌లో దూసుకుపోవాలని ట్రై చేస్తున్న భామల్లో ఆషికా రంగనాథ్ ఒకరు. అమిగోస్ తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడ్డ ఈ కన్నడ కస్తూరీ సెకండ్ మూవీనే టాలీవుడ్ మన్మధుడు నాగార్జునతో నా సామిరంగాలో నటించే ఛాన్స్ కొల్లగొట్టింది. ఈ టూ ఫిల్మ్స్ ప్లాప్ గా నిలిచాయి. టీటౌన్ కెరీర్ కాస్త డైలామాలో పడుతున్న టైంలో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరలో వన్ ఆఫ్ ది హీరోయిన్‌గా ఫిక్సైంది. అయితే ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ నెక్ట్స్ ఇయర్ సమ్మర్‌కు వస్తానంటోంది. ఇక రవితేజ 76లో కూడా ఆషికా రంగనాథ్ నటిస్తోంది . రీసెంట్లీ స్పెయిన్‌లో షూట్ పిక్స్ పంచుకుంది ఆషికా.
Also Read : NKR : డైరెక్టర్ గా మారుతున్న మరో రైటర్.. కళ్యాణ్ రామ్ తో సినిమా ఫిక్స్
కేజీఎఫ్‌తో పాపులారిటీ సంపాదించుకున్న శ్రీనిధి శెట్టి టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టేసింది. హిట్3తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది రీసెంట్లీ తెలుసుకదాతో డీసెంట్ హిట్ నమోదు చేసింది. నెక్ట్స్ థర్డ్ ఫిల్మ్ లోడ్ చేస్తోంది. వెంకీ- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాలో కన్ఫర్మ్ అయ్యింది బ్యూటీ. ప్రజెంట్ ఆమె చేతిలో ఉన్న ఏకైక తెలుగు ప్రాజెక్ట్ ఇదే. క్రేజీ ఆఫర్లు సీనియర్ హీరోలు, క్రేజీ దర్శకులతో వర్క్ చేయాలని ప్రతి హీరోయిన్ కలలుకంటుంటారు. అలాంటి ఆఫర్స్ వస్తే వద్దనుకుంటారా ఇప్పుడు ఈ భామలు కూడా అదే ఫాలో అయిపోతున్నారు. యంగ్ హీరోలతో నటిస్తామని గిరిగీసుకోకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగ పర్చుకుంటూ కెరీర్ బిల్డ్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు ఆషికా అండ్ శ్రీనిధి శెట్టిలు.