చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖ కోల్పోయిన చిత్రపరిశ్రమ తాజాగా మరో నటుణ్ని కోల్పోయింది. ప్రముఖ కన్నడ హాస్యనటుడు శంకర్ రావు మృతి చెందారు. సోమవారం బెంగళూరులోని ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచారు శంకర్రావు. 88 సంవత్సరాలు ఉన్న శంకర్ రావ్ గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు.
అయితే ఆరోగ్యం విషమించడంతో నిన్న రాత్రి మృతి చెందారు. ఏరా సాక్షి సినిమా తో శాండల్ వుడ్ లో శంకర్ రావు అరంగేట్రం చేశారు. అలాగే విష్ణువర్ధన్, శంకర్ నాగ్, అనంత్ నాగ్, లోకేష్, శ్రీనాథ్, ద్వారకీష్, శివరాజ్ కుమార్, రవిచంద్రన్, రమేష్ అరవింద్, ఉపేంద్ర, పునీత్ రాజ్ కుమార్ మరియు దర్శన్ వంటి ఎందరో అగ్రశ్రేణి స్టార్లతో ఆయన నటించారు. కాగా.. శంకర్ రావు మృతి పట్ల పలువురు సినీ తారలు సంతాపం వ్యక్తం చేశారు.