బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్. మూవీస్ విషయం కాస్త పక్కన పెడితే.. తన జోలికి ఎవరైనా వస్తే మాత్రం చెంపదెబ్బ కొట్టినట్టు సమాధానం ఇస్తుంది. అందుకే తనతో మాట్లాడటానికి చాలా మంది వెనకడుగేస్తారు. ముఖ్యంగా బాలీవుడ్ నటి అయినప్పటికి ఎప్పుడు హింది వారి మీద ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఓ దర్శక నిర్మాత పై ఆగ్రహం వ్యక్తం చేసింది..
Also Read: Jaya Bachchan : అక్షయ్ కుమార్ మూవీపై .. మండిపడ్డ జయబచ్చన్
రీసెంట్‌గా కంగన్న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా ‘ఎమర్జెన్సీ’ అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించిన కంగనా. ఎన్నో అడ్డంకులు దాటుకుని ఈ ఏడాది విడుదలైన ఈ చిత్రం నార్మల్ టాక్ తెచ్చుకుంది. ప్రజంట్ OTT లో మాత్రం విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే ఈ మూవీపై సంజయ్ గుప్తా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.. ‘ ‘ఎమర్జెన్సీ’ మూవీ చూశాను. కంగనా ఇంత చక్కగా రూపొందిస్తారని నేను ఊహించలేదు. ఆమె నా అంచనాలు తారుమారు చేశారు. ఇదొక అద్భుతమైన చిత్రం. ఈ సినిమాను ఆమె తెరకెక్కించిన తీరు.. ఆమె నటన చాలా బాగుంది’ అని ఆయన రాసుకొచ్చారు.
అయితే ఈ మాటల పై కంగనా ఫైర్ అయ్యింది..‘నా పై ముందుగానే ఒక అభిప్రాయానికి వచ్చినట్టు ఆయన తన పోస్ట్ లో తెలిపారు. నేను ఎలాంటి సినిమా చేశానో మీకు ముందే ఎలా తెలుసు..! నా గురించి ముందే తెలుసుకునేందుకు మీ వద్ద ఏమైనా అద్భుత శక్తులు ఉన్నాయా? ఒక వ్యక్తి గురించి ఒక అభిప్రాయానికి రావడానికి ముందు వాళ్ల గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలి. అయినా నన్ను జడ్జ్ చేసేందుకు మీకున్న అర్హతలు ఏమిటి? మీరు ఎలాంటి సినిమాలు రూపొందించారు? ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు ఎలాంటి సినిమాలు తెరకెక్కిస్తున్నారో ఒక్కసారి చెక్ చేసుకోవాలి’ అని గట్టిగా ఇచ్చి పడేసింది కంగనా.