సెలబ్రేటీల జీవితమంటే బయటివారికి లగ్జరీ, సౌకర్యాలు, పెద్ద భవనాలు, ఖరీదైన కార్లు, ఎంటర్టైన్‌మెంట్ అని అనుకుంటారు. కానీ ఈ మెరుపుల వెనుక వారికి ఎదురయ్యే ఒత్తిడులు, సమస్యలు మాత్రం చాలా మందికి తెలియవు. పాపులారిటీ పెరిగేకొద్దీ వారికి బయట స్వేచ్ఛగా తిరగడం కష్టం అవుతుంది. ఇవ్వని ఒకెత్తు అయితే సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్, అసభ్యకరమైన కామెంట్లు, విమర్శలు ఇవన్నీ సెలబ్రిటీలకు పెద్ద నెగటివ్ షేడ్స్ అని చెప్పాలి. కొందరు ఇవన్నీ దాటేసి ముందుకు సాగిపోతారు. మరికొందరు ధైర్యంగా తమ అనుభవాలను బయటపెడతారు. తాజాగా మరాఠీ నటి గిరిజ ఓక్ కూడా తనకు ఎదురైన చేదు అనుభవాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను షాక్‌కు గురిచేసింది.
Also Read : Riddhi: ప్రభాస్‌తో ఛాన్స్.. ప్రాంక్ అనుకున్నా
మరాఠీ చిత్రసీమలో పేరుపొందిన గిరిజా ఓక్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు వైరల్‌గా మారాయి. ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్న ఆమె, ఒక్క చిన్న క్లిప్‌తోనే సడన్‌గా సోషల్ మీడియా సెన్సేషన్ అయింది. ఫాలోవర్లు అమాంతం పెరిగారు, పాపులారిటీ కూడా రెట్టింపు అయింది. అయితే ఈ పేరే తనకు ఇప్పుడు ఇబ్బందులు తెచ్చిందని గిరిజా చెప్తోంది. “ఈ పాపులారిటీ వల్ల నా జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు. అలా అని పెద్దగా సినిమా ఆఫర్లు కూడా రావడం లేదు. కానీ బోనస్ గా నెగిటివ్ మరియు అసభ్యకర కామెంట్లు ఎక్కువవుతున్నాయి. ‘నీ రేటెంత?’ ‘గంటసేపు గడపాలంటే ఎంత?’ వంటి మెసేజ్‌లు రోజు వస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇలా కామెంట్ చేసే వాళ్ళు నిజ జీవితంలో నన్ను చూసినా కనీసం కన్నెత్తి చూడరు. గౌరవంగా మాట్లాడతారు. కానీ ఆన్‌లైన్‌లో మాత్రం నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు” అని గిరిజా ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె ఈ కామెంట్లు నెట్టింట బాగా వైరలవుతున్నాయి.