దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ లో కాజల్ ఒకరు. అనతి కాలంలోనే దాదాపు అందరు హీరోలతో జతకట్టిన ఈ ముద్దుగుమ్మ.. మిగతా భాషలో కూడా నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రజంట్ కొంత గ్యాప్ తీసుకున్న కాజల్, తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు బాలీవుడ్‌లో “ది ఇండియా స్టోరీ” మూవీలో కొత్త అవతారంలో కనిపించబోతుంది. శ్రేయాస్ తల్పాడే కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి చేతన్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ ఇటీవల విజయవంతంగా పూర్తయింది. కాగా కాజల్ తన సోషల్ మీడియా ద్వారా కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు సర్‌ప్రేజ్ ఇచ్చింది. ఇందులో కాజల్ న్యాయవాది పాత్రలో నటిస్తోంది.
Also Read : Tumbad : తుంబాడ్ సీక్వెల్‌లో బాలీవుడ్ బ్యూటీ..!
సినిమా కథ విషయానికి వస్తే.. వ్యవసాయం జీవనాధారంగా ఉన్న రైతులు, పురుగు మందుల వ్యాపారుల కుంభకోణాల చుట్టూ తిరుగుతుంది. కాజల్ ఇందులో రైతుల హక్కుల కోసం పోరాటం చేసే న్యాయవాది పాత్రలో కనిపించనుంది. మురళీ శర్మ, మనీశ్ వాధ్వా వంటి ప్రముఖ నటులు కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. మొత్తానికి వ్యవసాయం, న్యాయం, రైతుల సమస్యలపై ఈ కథ నడుస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. సాగర్ బి. షిండే నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ త్వరలో ట్రైలర్‌తో పాటు, అధికారిక విడుదల తేదీని ప్రకటించనుంది. ప్రస్తుతం కాజల్ ఖాతాలో “రామాయణ”, “ఇండియన్ 3” వంటి ప్రాజెక్టులు ఉన్నా, రైతుల కోసం పోరాటం చేసే ఈ పాత్ర ద్వారా ఆమె కొత్త దృక్పథాన్ని చూపుతూ అభిమానులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.