స్టార్ కపుల్స్‌లో జ్యోతిక – సూర్య ఒకరు. ఇద్దరికి ఇద్దరు కెరీర్ పరంగా , క్యారెక్టర్ పరంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. అయితే సూర్యను పెళ్లి చేసుకున్న తర్వాత జ్యోతిక కొంత కాలం పాటూ సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ తల్లిగా తన బాధ్యతలు తాను నిర్వర్తిస్తూ వస్తుంది. కానీ అందరూ సూర్య అతని ఫ్యామిలీ జ్యోతికను సినిమాల్లోకి వద్దని చెప్పారని అనుకున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చింది.
Also Read: Deepika Padukone : తల్లి బాధ్యత నిర్వర్తించడం చాలా కష్టం..
‘ నా ఫ్యామిలీ నను సినిమాల్లోకి వద్దన్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. మా పెళ్లయ్యాక సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్న మాట నిజమే. కానీ తల్లిగా నా పిల్లలను చూసుకునే బాధ్యత నా మీద ఎంతో ఉంది. అలాంటి సమయంలో కూడా సినిమాల్లోకి మళ్లీ ఎప్పుడొస్తావని సూర్యనే నను రెగ్యులర్‌గా అడుగుతూ ఉండేవాడు. నేను నటించిన పాత సినిమాలు టీవీలో వచ్చేటప్పుడు, ఆమె ఎంతో మంచి నటి. ఎందుకు ఆమెను సినిమాల్లోకి రానివడ్డం లేదని సూర్యకు కొంతమంది మెసేజ్‌లు పంపేవారు. ఆ మెసేజ్‌లను సూర్య నాకు ఫార్వార్డ్ చేసేవాడు. బాధ్యతల కారణంగా దూరంగా ఉన్న తప్ప నను ఎవరు వద్దు అనలేదు’ అని తెలిపింది.
ఇక ప్రజంట్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన జ్యోతిక వరుస సినిమాలు, సిరీస్‌లతో ధూసుకుపోతుంది. ఎక్కువగా బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టిన ఆమె ప్రస్తుతం ‘డబ్బా కార్టెల్’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తుంది. త్వరలోనే ‘సైతాన్’ సీక్వెల్‌ను చేయనుంది. దీంతో పాటు అమెజాన్ ప్రైమ్ కోసం ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఓ వెబ్ సిరీస్ లో కూడా జ్యోతిక నటించనుంది. మొత్తానికి జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎక్కువగా బాలీవుడ్ పైనే ఫోకస్ చేసి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.