ప్రజంట్ బాలీవుడ్ టు టాలీవుడ్ పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పుడు మన సౌత్ సినిమా నుంచి హీరోయిన్స్, నార్త్ ఇండియా సినిమాకి వెళ్లి సెటిల్ అవ్వాలని కోరుకునేవారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్లే మన వైపు వస్తున్నారు. అలా ఇప్పటికే తెలుగులో ఆల్రెడీ బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ఆలియా భట్, దీపికా పదుకొనే అలాగే దిశా పటాని సహా ఇపుడు జాన్వీ కపూర్ తమ టాలెంట్ అండ్ గ్లామర్‌షో తో అదరగొడుతున్నారు.
Also Read: Keerthy Suresh : మరో బాలీవుడ్ ప్రాజెక్ట్‌కి సిద్ధమవుతున్న మహానటి !
ఇక ఇందులో బాలీవుడ్ సినిమాలో బిగ్గెస్ట్ స్టార్ అయినటువంటి దీపికా పదుకొనే ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఎడి’ మూవీతో తెలుగు సినిమాకు పరిచయం అయ్యింది. షూటింగ్ లో స్వయంగా తెలుగు డైలాగ్ లు తానే పలికి ఇంప్రెస్ చేసింది. ఇక త్వరలో ఈ మూవీ పార్ట్ 2 కూడా ప్రారంభంకాబోతుంది. దీంతో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న ఈ అమ్మడు షూటింగ్‌లో పాల్గోనడం గురించి మాట్లాడుతూ ఇంట్రస్టింగ్ విషయాలు పంచుకుంది.
అయితే దీపికా పదుకొణె సెప్టెంబర్ 9న తన కుమార్తెకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్న దీపిక ‘ఒక తల్లిగా చిత్రీకరణలో పాల్గొనడం అనేది సవాలే. ప్రస్తుతం నేను నా జీవితంలో మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నాను. ఇకపై షూటింగ్‌ల్లో పాల్గొనేందుకు సిద్ధమవ్వాలి. నా కుమార్తెకు తల్లిగా నా బాధ్యతలను నిర్వర్తిస్తూనే సినిమా షూటింగ్‌లో పాల్గొనాలి. ఇది నాకు అతి పెద్ద సవాలుగా అనిపిస్తుంది. దీన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తున్నాను. కానీ కచ్చితంగా దీన్ని ఎదుర్కొంటానని నమ్మకం నాకు ఉంది. మాతృత్వం అనేది గొప్ప అనుభూతి. దీని కారణంగా నేను ఎంచుకునే సినిమాలపై ప్రభావం పడుతుంది అని నాకు తెలుసు. కానీ నేను తల్లి కాకముందు సినిమాల ఎంపికలో ఎలా అయితే జాగ్రత్తలు తీసుకున్నాన్నో, ఇకపై కూడా అలాగే తీసుకుంటాను’ అని దీపిక తెలిపింది.