‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో సక్సెస్‌ని సాధించిన జూనియర్ ఎన్టీఆర్, ఆ తర్వాత చేసిన ‘ఆది’, ‘సింహాద్రి’ సినిమాలతో మాస్ హీరోగా మారిపోయాడు. ఒకానొక సందర్భంలో ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్‌కి చేరుకుంటాడనేంతలా తన నట విశ్వరూపాన్ని చూపించాడు. కానీ మధ్యలో సరైన సక్సెస్‌లు రాకపోవడంతో ఆయన కొంచెం వెనకబడిపోయారు. ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలు సైతం ప్రేక్షకులను పూర్తిస్థాయిలో అలరించడం లేదు. కొన్ని సినిమాలు సక్సెస్‌ని సాధించినా కూడా బ్లాక్ బస్టర్ దిశగా ముందుకు దూసుకెళ్లడంలో వెనుకబడిపోతున్నాయి. కాబట్టి ఆయన ఏరికోరి మరీ ప్రశాంత్ నీల్‌తో ‘డ్రాగన్’ మూవీ చేస్తున్నాడు. ‘డ్రాగన్’ సినిమా టీజర్‌లో ఆ మూవీ వరల్డ్‌ను పరిచయం చేశారు. కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉండడంతో ఈ సినిమా మీద ఎన్టీఆర్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీ సూపర్ సక్సెస్‌ని సాధిస్తే, త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమా మీద కొంతవరకు ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్‌గా ఎన్టీఆర్, అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో సినిమా చేయబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేశాడు. త్రివిక్రమ్‌ను పక్కన పెట్టడానికి అనిల్‌ని రంగంలోకి దించుతున్నాడా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి త్రివిక్రమ్, అనిల్ రావిపూడి చేసే సినిమాల జానర్స్ వేర్వేరు కాబట్టి, ఈ రెండు సినిమాలు ఒకదానికి ఒకటి పోటీ కాదని తెలుస్తోంది. ‘గాడ్ ఆఫ్ వార్’ మూవీని త్రివిక్రమ్ మైథలాజికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు.
అనిల్ రావిపూడి పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను చేయబోతున్నాడు. ఎన్టీఆర్‌ను అనిల్ ఎలా చూపిస్తాడనేదే అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మూవీలో ఎన్టీఆర్ చాలా సంవత్సరాల తర్వాత ఒక ఫుల్ లెంత్ మాస్ కమర్షియల్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడనే విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. సినిమాలో కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలాగే కంటెంట్ విషయంలో కూడా ఆయన చాలా కేర్‌ఫుల్‌గా వ్యవహరిస్తుంటాడు. ప్రేక్షకులందరినీ నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకొని, యాక్షన్ సన్నివేశాలను సైతం చాలా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దగలిగే కెపాసిటీ ఉన్న అనిల్ రావిపూడి, జూనియర్ ఎన్టీఆర్‌ను ఏ రేంజ్‌లో చూపిస్తాడనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. అనిల్ రావిపూడి సినిమాకి, త్రివిక్రమ్‌తో చేయబోయే మూవీకి మధ్య ఎలాంటి కనెక్షన్ లేదని, వీళ్ళిద్దరితో సినిమా చేయడానికి ఎన్టీఆర్ కమిట్ అయ్యారు. కాబట్టి ఇద్దరితో సినిమాలు చేస్తాడని అతని అభిమానులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. త్రివిక్రమ్ ఇంతకుముందు ఎన్టీఆర్‌కి ‘అరవింద సమేత వీర రాఘవ’తో సూపర్ సక్సెస్‌ని అందించాడు. కాబట్టి ఎన్టీఆర్ ఆ కృతజ్ఞతతో, త్రివిక్రమ్ సక్సెస్‌లో లేకపోయినా కూడా అతనితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తుండటం విశేషం.

