Prashanth Neel: ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్ 2’ మాస్టర్ ప్లాన్ లీక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘డ్రాగన్’. ఇప్పటికే దేశవ్యాప్తంగా అంచనాలను ఆకాశానికి ఎత్తేసిన ఈ సినిమా, లేటెస్ట్ గా విడుదలైన గ్లిమ్స్ తో ఆ హైప్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళింది. ముఖ్యంగా తారక్ మాస్ లుక్, డార్క్ టోన్, మైండ్ బ్లోయింగ్ విజువల్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో YouTube లో 24 గంటల్లోనే ఏకంగా 64 మిలియన్ వ్యూస్ సాధించి ఆల్ టైం రికార్డ్ సెట్ చేసింది. ఇదిలా ఉంటే, ఇప్పుడు ‘డ్రాగన్ పార్ట్ 2’ గురించి ఫిలిం నగర్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ సినిమా రెండు భాగాలుగా రానుందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
‘డ్రాగన్’ కథ చాలా పెద్ద స్థాయిలో ఉండడంతో ప్రశాంత్ నీల్ దీనిని రెండు భాగాలుగా తెరకెక్కించాలని ఫిక్స్ అయినట్లు టాక్. అయితే ఈసారి ‘సలార్’ మూవీలా కాకుండా ఒక పక్కా ప్లాన్ వేస్తున్నాడట నీల్, ‘సలార్’ సినిమాను రెండు భాగాలుగా ప్రకటించిన ప్రశాంత్ నీల్, మధ్యలో ఎన్టీఆర్ తో ‘డ్రాగన్’ ను సెట్స్ పైకి తీసుకెళ్ళాడు. కానీ, ‘డ్రాగన్’ పార్ట్స్ మధ్య మాత్రం ఎలాంటి గ్యాప్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాడట. అందుకే, పార్ట్ 1 తో పాటే పార్ట్ 2 కి సంబంధించిన షూటింగ్ ను కూడా సమాంతరంగా పూర్తి చేస్తున్నట్లు సమాచారం.
Also Read
- Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
- Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
- Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
- The Paradise Censor Cuts: నాని 'ది ప్యారడైజ్' పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
చాలా తక్కువ గ్యాప్ లోనే ‘డ్రాగన్ 2’ ని థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ చూస్తున్నారు. డ్రాగన్ పార్ట్ 1: జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. డ్రాగన్ పార్ట్ 2: కేవలం ఆరు నెలల వ్యవధిలోనే, అంటే డిసెంబర్ 2027 లోనే రిలీజ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఆఫ్ఘనిస్తాన్ బ్యాక్ డ్రాప్ లో సాగనుండగా, సెకండ్ పార్ట్ మాత్రం ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా నెట్వర్క్ అయిన ‘గోల్డెన్ ట్రయాంగిల్’ నేపథ్యంలో ఉండబోతోంది. అన్నట్టు.. పార్ట్ 1 కోసం బాగా బరువు తగ్గిన ఎన్టీఆర్, పార్ట్ 2 కి వచ్చేసరికి కథ డిమాండ్ మేరకు మళ్ళీ బల్క్ లుక్ లోకి మారనున్నట్లు గట్టిగా టాక్ వినిపిస్తోంది. మరి ప్రశాంత్ నీల్ సృష్టించబోయే ఈ డ్రాగన్ సామ్రాజ్యం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను వేటాడనుందో చూడాలి!
తాజావార్తలు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
-
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
-
Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
-
Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!