యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగానే కాకుండా ”బిగ్ బాస్”కు హోస్ట్ గానూ వ్యవహరించి బుల్లితెరపై టాప్ టిఆర్పీ రేటింగ్ క్రియేట్ చేసి సత్తా చాటాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ “ఆర్ఆర్ఆర్” చిత్రంలో ఎన్టీఆర్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మళ్ళీ స్టార్ట్ అయ్యింది. అయితే మరోవైపు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించాల్సిన బుల్లితెర పాపులర్ షో “ఎవరు మీలో కోటీశ్వరుడు?” షో. ఇప్పుడు ఎన్టీఆర్ ఈ షో కోసం టెస్ట్ లుక్ లో పాల్గొంటున్నాడట. ఈ షో కోసం తారక్ వివిధ వస్త్రధారణలను ప్రయత్నించి చూస్తున్నాడు. ఈ లుక్స్ లో ఒకటి త్వరలో ఫైనల్ అవుతుంది. ఆ తరువాత షో చిత్రీకరణ ప్రారంభమవుతుంది అంటున్నారు. “ఆర్ఆర్ఆర్” పూర్తయ్యాక ఈ షో కోసం షూటింగ్ ప్రారంభించనున్నారు.