NTR : ఎన్టీఆర్ ‘బాల రామాయణం’ కంటే ముందే తాతతో కలిసి ఆ సినిమాలో నటించాడని మీకు తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడిగా, దివంగత నందమూరి హరికృష్ణ కుమారుడిగా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్, తన 25 ఏళ్ల కెరీర్లో ఇప్పటివరకు 30 సినిమాల్లో హీరోగా నటించడం జరిగింది. తాజాగా సెన్సేషన్ సృష్టిస్తున్న ‘డ్రాగన్’ మూవీ జూనియర్ ఎన్టీఆర్‌కు 31వ చిత్రం. అయితే, ఈ మూవీస్ అన్నిటికన్నా ముందు జూనియర్ ఎన్టీఆర్ తన జూనియర్ ఏజ్‌లోనే చైల్డ్ ఆర్టిస్టుగా మూడు విభిన్న పాత్రలు పోషించాడు.
అందరికీ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘బాల రామాయణం’ చిత్రంలోని బాల రాముడి పాత్ర మాత్రమే బాగా తెలుసు. కానీ, ఈ తారక రాముడు ఆ బాల రాముడి పాత్ర వేయకముందు రెండు ప్రత్యేక పౌరాణిక పాత్రలు సైతం వేశాడు. నందమూరి తారక రామారావు హీరోగా, ఆయన స్వీయ దర్శకత్వంలోనే వచ్చిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రాన్ని హిందీ వెర్షన్లో కూడా తెరకెక్కించగా, అందులో జూ. ఎన్టీఆర్ ఎనిమిదేళ్ల వయసులోనే భరతుడిగా నటించి తాతతో స్క్రీన్ షేర్ చేసుకునే చక్కటి అదృష్టాన్ని పొందాడు.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
అంతేకాదు, బాల రామాయణం చిత్రంలో బాల రాముడిగా నటించక ముందు 13 ఏళ్ల వయసులో ఈటీవీలో వచ్చిన ‘భక్త మార్కండేయ’ అనే సీరియల్లో భక్త మార్కండేయుడిగా కూడా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇలా జూ. ఎన్టీఆర్ హీరో కాకముందే కొన్ని విలక్షణమైన పౌరాణిక పాత్రలు పోషించి, వంశానికి తగ్గ వారసుడిగా వారెవా అనిపించుకున్నాడు. ఇక ఇప్పుడైతే ‘డ్రాగన్’, ‘దేవర 2’ వంటి హై వోల్టేజ్ యాక్షన్ మూవీస్‌లో నటిస్తూ.. తన అద్భుతమైన డ్యాన్స్ అండ్ డైలాగ్ డెలివరీతో అటు తెలుగు అభిమానులతో పాటు, ఇటు జపాన్ అభిమానులను సైతం గెలుచుకుని, తన అభిమానాన్ని ఖండాంతరాలు దాటేలా చేస్తున్నాడు.
తాజావార్తలు
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!