బాలీవుడ్ రీమేక్స్ లిస్టులో అఫీషియల్ గా మరో మలయాళ చిత్రం చేరిపోయింది. సౌత్ లో సూపర్ హిట్టైన ‘హెలెన్’ మూవీ హిందీలో బోనీ కపూర్ పునర్ నిర్మిస్తున్నాడు. జాన్వీ కపూర్ టైటిల్ రోల్ లో ‘మిలి’గా తెరకెక్కుతోంది తాజా చిత్రం. నిజానికి ‘హెలెన్’ బాలీవుడ్ వర్షన్ జూన్ లోనే సెట్స్ మీదకు వెళ్లాల్సింది. కానీ, కోవిడ్ నిబంధనల కారణంగా ఆగస్ట్ వరకూ ఫస్ట్ షెడ్యూల్ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా చిత్ర షుటింగ్ ముంబైలో ప్రారంభమైంది.
Read Also : షారుఖ్ తో కాజోల్… నిజం కాదంటోన్న సీనియర్ బ్యూటీ!
‘మిలి’ పేరుతో రీమేక్ అవుతోన్న ‘హెలెన్’ హిందీ వర్షన్ కి కూడా మతుకుట్టీ జేవియర్ దర్శకుడు. ఆయనే మలయాళ ఒరిజినల్ కి కూడా దర్శకత్వం వహించాడు. ఇక ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా జాన్వీ కపూర్ స్టారర్ మూవీని ఫారిన్ లో షూట్ చేసే ఆలోచనలు పక్కన పెట్టేశారట ఫిల్మ్ మేకర్స్. ఇండియాలోనే మొత్తం సినిమా అంతా పిక్చరైజ్ చేస్తారని టాక్. చూడాలి మరి, పర్ఫామెన్స్ కి మంచి స్కొప్ ఉన్న సర్వైవల్ థ్రిల్లర్ ‘మిలి’లో జాన్వీ తనని తాను ఎలా ప్రూవ్ చేసుకుంటుందో…