ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ ఎంతో అవసరం అనే విషయాన్ని డాక్టర్లు చెబుతూనే ఉన్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్క్ ధరించడం, రెగ్యులర్ గా శానిటైజర్ ఉపయోగించడం కూడా చాలా ముఖ్యం. అయితే ముందుగా వ్యాక్సిన్ వేయించుకోవడానికి జనాలు భయపడ్డారు. కానీ ఇప్పుడు అందరిలో అవగాహన రావడంతో వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో రకరకాల అనుమానాలు వారిని వెంటాడుతున్నాయి. వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చా? లేదా? తీసుకోవడం వల్ల కలిగే పరిణామాలు, సైడ్ ఎఫెక్ట్స్…
కరోనా మహమ్మారి ఇప్పుడు అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. కరోనా కారణంగా 14 రాష్ట్రాల్లో ఇప్పటికే కంప్లీట్ లాక్ డౌన్ పెట్టేశారు. ఎంతోమంది కరోనా బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంకా చాలామంది కరోనాతో పోరాడుతున్నారు. ఇక రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య అందరిలో ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా జాగ్రత్తలు చెబుతూ చేసిన వరుస ట్వీట్లు ఆయన అభిమానుల్లో, నెటిజన్లలో ధైర్యాన్ని నింపుతున్నాయి. “ప్రతిరోజూ కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి.…
రెండు దశాబ్దాలకు పైగా జగపతి బాబు అభిమానిగా ఉన్న శ్రీను ఈ రోజు ఉదయం కరోనాతో గుంటూరులో కన్నుమూశారు. ఈ విషయం తెలిసి జగపతిబాబు తన సంతాపాన్ని తెలియచేశారు. గుంటూరులోని తన అభిమాన సంఘం ప్రెసిడెంట్ గానూ ఉన్న శ్రీను మరణం జీర్ణించుకోలేనిదని అన్నారు. విశేషం ఏమంటే… జగపతిబాబును ఎంతగానో అభిమానించే శ్రీను తన కుమారుడొకరికి జగపతి పేరునే పెట్టారు. శ్రీను కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని తెలిపిన జగపతిబాబు, కరోనా కారణంగా కళ్ళ ముందు ఎంతో మంది…