రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ జగపతి బాబుది డిఫరెంట్ లైఫ్ స్టైల్.. తాజాగా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫోటో వైరల్ గా మారింది. తెలుపు కుర్తా పైజామాలో ఉన్న జగపతిబాబు చేతిలో బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని గోడపై కూర్చున్న స్టిల్‌ను ట్విటర్ పోస్ట్ చేశారు. అయితే చూడ్డానికి ‘డైనమిక్ పొలిటిషియన్ లా కనిపిస్తున్నారు.. మీరు త్వరలో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నారా..?’ అని ఓ అభిమాని ప్రశ్నించాడు. జగ్గూభాయ్ రిప్లై ఇస్తూ.. ‘ఖచ్చితంగా రాజకీయ నాయకుడిగా మాత్రం ఉండాలనుకోవడం లేదు’ అని బదులిచ్చారు. ఎన్నో సినిమాల్లో తన విలక్షణమైన నటనతో ఆకట్టుకున్న జగపతిబాబు ప్రస్తుతం ‘టక్ జగదీష్’ ‘మహాసముద్రం’, ‘రిపబ్లిక్’ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు.
Definitely not aspiring to be a politician. pic.twitter.com/0f460dHnwv
— Jaggu Bhai (@IamJagguBhai) July 6, 2021