భారీ రేంజ్ లో “జగమే తందిరం” రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజా చిత్రం ‘జగమే తందిరం’. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్ కెరీర్లో 40వ చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.శశికాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. ‘జగమే తందిరం’లో ధనుష్ ‘సురులి’ అనే గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నాడు. ఈ తమిళ చిత్రం జూన్ 18న ప్రముఖ ఓటిటి వేదిక నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవ్వబోతోంది. తెలుగులో ‘జగమే తంత్రం’గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఓటిటిలో భారీ రేంజ్ లో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్. నెట్ ఫ్లిక్స్ లో దాదాపు 190 దేశాల్లో, 17 భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుండడం విశేషం. ఇటీవల ధనుష్ నటించిన “కర్ణన్” చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో తాజాగా విడుదల కానున్న “జగమే తందిరం” చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ చిత్రం అంచనాలను అందుకుంటుందేమో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?