Tollywood: ఫేక్ హౌస్‌ఫుల్స్… డమ్మీ కలెక్షన్స్! టాలీవుడ్లో కొత్త “మైండ్ గేమ్”!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోల సినిమాలకు ఏమాత్రం ప్రమోషన్లు అక్కర్లేకున్నా థియేటర్ల వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తాయి కానీ మీడియం రేంజ్ హీరోల పరిస్థితి అలా లేదు. యంగ్ హీరోల సినిమాల బడ్జెట్లు కోట్లలో పెరిగిపోతున్నాయి తప్ప, మొదటి రోజు థియేటర్లకు జనాన్ని రప్పించే “ఓపెనింగ్ పుల్” మాత్రం గణనీయంగా పడిపోయింది. దీంతో ప్రస్తుతం తెలుగులో ఒక విచిత్రమైన, ప్రమాదకరమైన ధోరణి ఊపందుకుంటోంది అనే చర్చ జరుగుతోంది. అదే “తమ సినిమాల టికెట్లను నిర్మాతలు, హీరోలే స్వయంగా కొనుగోలు చేయడం!” సినిమాకు ఆడియెన్స్ రావట్లేదనే నగ్న సత్యాన్ని కప్పిపుచ్చేందుకు నిర్మాతలు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. థియేటర్లలో సీట్లు ఖాళీగా కనిపిస్తే నెగెటివ్ టాక్ వస్తుందనే భయంతో, వందలాది టికెట్లను బల్క్‌గా కొనేస్తున్నారు, అవి ట్విట్టర్ ఇన్ ఫ్లూయనర్స్ తో గివ్ అవేల పేరుతో పంచిస్తున్నారు. అలా బుకింగ్ యాప్‌లలో “హౌస్‌ఫుల్”, “ఫాస్ట్ ఫిల్లింగ్” బోర్డులు దర్శనమిచ్చేలా చేసి, ఆ ప్లాట్‌ఫామ్‌లలో తమ చిత్రం ట్రెండింగ్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. గడిచిన కొన్ని నెలల్లోనే ఈ రకం టికెట్ కొనుగోళ్ల వ్యవహారం రెండు మూడుసార్లు బహిర్గతమై, ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
డిజిటల్ మీడియా కాలంలో మీమ్ పేజీలకు, పేయిడ్ సోషల్ మీడియా ట్రెండ్స్‌కు, ఇన్ఫ్లుయెన్సర్లకు లక్షల రూపాయలు గుమ్మరించడం కంటే… ఆ డబ్బుతో డైరెక్ట్‌గా టికెట్లే కొనేయడం బెటర్ అనేది కొందరు నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. బుకింగ్ యాప్‌లో “ఆల్ మోస్ట్ ఫుల్” అని కనిపిస్తే, సాధారణ ప్రేక్షకుడు కూడా “ఈ సినిమా బాగుందేమో, జనాలు బాగా వెళ్తున్నారు” అనే భ్రమలో టికెట్ బుక్ చేసుకుంటాడనేది వీరి ఆశ. దానికి తోడు న్యూస్ పేపర్లపై, సోషల్ మీడియాలో భారీ కలెక్షన్ల రికార్డులు చూపిస్తూ సినిమాను “బ్లాక్ బస్టర్”గా ప్రచారం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతోంది. అయితే, ఈ మైండ్ గేమ్ ద్వారా లభించే విజయం కేవలం కాగితాలకే పరిమితం! వాస్తవానికి సినిమా సాధించే అసలైన వసూళ్లు చాలా తక్కువ. భారీగా టికెట్లు కొని, సినిమాను హిట్‌గా ప్రాజెక్ట్ చేసినా… రోజు చివరికి నిర్మాతలకు మిగిలే అసలు లాభాలు సున్నా.
Also Read
ఈ రకమైన బురిడీ ప్రచారం కేవలం మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు మాత్రమే ఎంతో కొంత ఊపునివ్వగలదు. మొదట్లో ఈ గిమ్మిక్స్ చేసి జనాన్ని థియేటర్‌కి రప్పించినా, కంటెంట్‌లో దమ్ము లేకపోతే మొదటి షో పడగానే “వర్డ్ ఆఫ్ మౌత్” బయటికొచ్చేస్తుంది. ప్రేక్షకుల నిజమైన రివ్యూల ముందు ఈ ఆర్టిఫిషియల్ హౌస్‌ఫుల్స్ నిలబడలేవు. సొంత డబ్బులతో టికెట్లు కొనుక్కుంటూ “హిట్” ముద్ర వేయించుకోవడం ఎంతకాలం సాధ్యం? ఇది పరిశ్రమ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఒక ప్రమాదకరమైన తాత్కాలిక గిమ్మిక్ మాత్రమే. స్వయంకృతాపరాధంతో పెంచేసుకున్న బడ్జెట్లను తగ్గించుకుని, ప్రచార ఆర్భాటాల కంటే బలమైన కథలపై దృష్టి పెట్టడమే మిడ్-రేంజ్ సినిమాలను, నిర్మాతలను రక్షించే ఏకైక మార్గం. నాణ్యమైన కంటెంట్ లేనప్పుడు ఎన్ని వేల టికెట్లు బల్క్‌గా కొన్నా… బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం అసాధ్యం! ఎందుకంటే సినిమాలు తీసేదే టికెట్లు అమ్మి డబ్బు సంపాదించడం కోసం, ఇప్పుడు వీరే టికెట్లు ఇలా కొంటుంటే ఇక దానికి అర్ధమేముంటుంది?
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!