సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో ‘జాక్’ అనే సినిమా రూపొందింది. బోగవల్లి బాపినీడు నిర్మాతగా, ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ మీద నిర్మించారు. వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఏప్రిల్ 10వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధం చేశారు. నిజానికి, ఈ సినిమాకు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బొమ్మరిల్లు భాస్కర్ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే, ఆయన చేసిన దాదాపు అన్ని సినిమాలలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ‘బొమ్మరిల్లు’, ‘పరుగు’, ‘ఆరెంజ్’, ‘ఒంగోలు గిత్త’, ఇటీవల వచ్చిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో పాటల గురించి కూడా ఇప్పటికీ చర్చించుకుంటూ ఉంటారు, వింటూ ఉండేవారు కూడా ఉన్నారు.
Jaat : తెలుగులోనూ ‘జాట్’.. ఎప్పుడంటే?
అలాంటి డైరెక్టర్ ఏకంగా ముగ్గురు సంగీత దర్శకులతో పని చేసిన సరే, ఈ సినిమాకు సరైన చార్ట్‌బస్టర్ అందించలేకపోవడం గమనార్హం. ఈ సినిమాలో ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు పాటలకు ఆశించిన మేర రెస్పాన్స్ రాలేదు. అచ్చు రాజమణి, సురేష్ బొబ్బిలి, శ్యామ్ సి.ఎస్. ఈ సినిమాకు సంగీతం అందించడంతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అందించారు. బొమ్మరిల్లు భాస్కర్ ట్రాక్ రికార్డ్‌ను బట్టి విశ్లేషిస్తే, ఆయన సినిమాకు మ్యూజిక్ విషయంలో ఆశించిన రెస్పాన్స్ రాకపోవడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. అయితే, సినిమా పరంగా చూస్తే, ‘జాక్’ మంచి డీసెంట్ సినిమాగా ఉంది. సిద్ధు జొన్నలగడ్డ రేంజ్‌కి తగ్గ హీరోగా, కావాల్సినంత సినిమా మీద ఆసక్తి ప్రేక్షకులలో ఉంది. సినిమా ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మరికొద్ది గంటలలో తేలిపోతుంది.