జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. రాంప్రసాద్ ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ కావడంతో రాంప్రసాద్ కి స్వల్ప గాయాలైనట్లు చెబుతున్నారు. గురువారం ఉదయం షూటింగ్ కి వెళుతున్న క్రమంలో తుక్కుగూడ సమీపంలో రాంప్రసాద్ ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న కారు బ్రేక్ వేయడంతో రాంప్రసాద్ ప్రయాణిస్తున్న కారు ఆ కారును ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాంప్రసాద్ కారును వెనుక నుండి ఆటో ఢీకొట్టింది అని రాంప్రసాద్ కారు ముందున్న మరో కారుని కూడా ఢీ కొట్టిందని తెలుస్తోంది.
Pushpa 2: మహిళ మృతిపై స్పందించిన మైత్రీ మూవీ మేకర్స్
ఈ క్రమంలో రాంప్రసాద్ కి స్వల్ప గాయాలు కావడంతో ఆయనను కూడా హాస్పిటల్ కి తరలించినట్లు చెబుతున్నారు. ఈ యాక్సిడెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫేమస్ అయిన వారిలో ఆటో రాంప్రసాద్ కూడా ఒకరు సుడిగాలి సుధీర్, గెటప్ శీను, ఆటో రాంప్రసాద్ కలిసి చేసిన స్కిట్స్ ఎన్నో సూపర్ హిట్ అయ్యాయి. గెటప్ శీను, సుధీర్ హీరోలుగా మారి బయటకు వెళ్లి ప్రయత్నాలు చేస్తున్న రాంప్రసాద్ మాత్రం జబర్దస్త్ లో టీం లీడర్ గానే కొనసాగుతున్నాడు. ఇటీవల ఆయన దేవకీ నందన వాసుదేవ అనే సినిమాకి రచయితగా కూడా వ్యవహరించాడు.