దక్షిణ భారత సంగీత సంచలనం అనిరుధ్. ఇప్పుడు తన మ్యూజిక్‌తో ట్రెండింగ్‌లో ఉండటమే కాదు టాలీవుడ్‌లో భారీ రెమ్యునరేషన్‌తో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాకి రూ.12 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్‌లో తను చేయబోతున్న ప్రాజెక్టులకు రూ.15 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. కానీ అసలు ప్రశ్న మ్యూజికల్‌గా ఇవి కొత్తదనం చూపిస్తున్నాయా? చాలా సందర్భాల్లో ట్రాక్స్ రెగ్యులర్ టెంప్లేట్లోనే ఉంటున్నాయని, మ్యూజికల్ డెప్త్ కంటే నాయిస్ ఎక్కువైపోతోందని మ్యూజిక్ లవర్స్ ఫీలవుతున్నారు.
Also Read : HHVM : హరిహర వీరమల్లుపై క్రిష్ జాగర్లమూడి షాకింగ్ పోస్ట్
అనిరుధ్ మ్యూజిక్ హక్కులే తన పారితోషికాన్ని తిరిగి తెచ్చేస్తాయని నిర్మాతలకు హామీ ఇస్తున్నాడు. కాని, ఒక సినిమా బడ్జెట్‌లో ఎక్కువ భాగం కేవలం ఒక్క సంగీతానికే కేటాయించడమంటే చిన్న నిర్మాతలకు గుండె గుభేలుమంటుంది. అలాగే ఏదో ఒక సాంగ్ కి మాత్రమే హైప్ వస్తుంది తప్ప మిగిలిన పాటల్ని ఆడియన్స్ పట్టించుకోవడం లేదనేది వాస్తవం. అయితే అనిరుధ్ మాత్రం తన సాంగ్స్ కి నేషనల్ వైడ్ డిమాండ్ పెరిగిందని, మ్యూజిక్ లేబుల్స్ మధ్య హెవీ కాంపిటీషన్ నడుస్తున్న తరుణంలో తన మ్యూజిక్ రైట్స్ ఆకాశాన్ని తాకుతున్నాయని అనిరుద్ వాదన. ఒకవైపు అనిరుధ్ సంగీతానికి యూత్ ఊగిపోతుంటే మరోవైపు మ్యూజిక్ లవర్స్ మాత్రం నిరాశకు లోనవుతున్నారు. పాటలు హిట్ అవుతున్నా మ్యూజిక్ మేనియా కంటే మార్కెటింగ్ మేజిక్ ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు. అనిరుధ్ యూత్ ను ఆకట్టుకునే సంగీత దర్శకుడు అనే దాంట్లో సందేహం లేదు. అయితే అనిరుద్ సౌండ్ మిక్స్ గొప్పగా ఉన్నా సోల్ మిస్ అవుతున్నాడన్నది విమర్శకుల మాట. ప్రెజెంట్ అనిరుధ్ తమిళంలో కూలీ, జైలర్2, జన నాయకన్, బాలీవుడ్ లో షారూక్ ఖాన్ నటిస్తున్న కింగ్ లాంటి బిగ్ మూవీస్ తో బిజీ అయిపోయాడు. దాంతో చిన్న సినిమాలు, డిఫరెంట్ కాన్సెప్ట్‌లను పట్టించుకోవడం తగ్గించాడు.