HHVM : హరిహర వీరమల్లుపై క్రిష్ జాగర్లమూడి షాకింగ్ పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పిరియాడికల్ చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి తొలుత దర్శకత్వం వహించాడు. కొంత మేర షూటింగ్ జరిగాక పవన్ పొలిటికల్ గా బిజీగా ఉండడంతో క్రిష్ కు ఉన్న ఇతర కమిట్మెంట్స్ కారణంగా హరిహర వీరమల్లు దర్శకత్వ భాద్యతల నుండి తప్పుకున్నాడు. మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్నఈ సినిమాకు సంబంధించి క్రిష్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
Also Read : HHVM : వీరమల్లు రిలీజ్ కు ముందే ఫ్యాన్స్ ఆకలి తీర్చిన పవర్ స్టార్
Also Read
క్రిష్ ఏమన్నారంటే ‘ హరి హర వీర మల్లు ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు. కానీ నిశ్శబ్దంగా కాదు. ప్రతి ఫ్రేమ్ లో చరిత్ర యొక్క గొప్పతనాన్ని తెలియజేసేందుకు వస్తున్నాడు. ఈ ప్రయాణం ఇద్దరు గొప్ప దిగ్గజాల ద్వారా సాధ్యమైంది. సినిమాలోనే కాదు, ఆత్మ విశ్వాసంలోనూ మన పవన్ కళ్యాణ్ ఒక అసాధారణ శక్తి. ఆయనలో ఏ కెమెరా చూపించలేని ఒక పవర్ ఉంది. ఆయన నిత్యం మండే స్ఫూర్తి హరి హర వీరమల్లులోకి ప్రాణం పోసింది. ఆయన హరిహర వీరమల్లుకు వెన్నెముక. A.M. రత్నం ఒక గొప్ప శిల్పి. బలమైన విశ్వాసంతో సినిమాలు నిర్మించగలడం ఆయన సామర్థ్యం. హరిహర వీరుమల్లు సినిమా తెరకెక్కిందంటే అది ఆయన అచంచలమైన బలం వల్లనే. ఈ సినిమా నా గొప్ప సినిమాలలో ఒకటి. దర్శకుడిగా మాత్రమే కాదు, మరచిపోయిన చరిత్రను అన్వేషించేవాడిగా, సత్యాలను అన్వేషించేవాడిగా, ప్రపంచ నిర్మాణానికి అవకాశంగా, అన్నింటికంటే ముఖ్యంగా, వినోదాన్ని మరియు జ్ఞానోదయాన్ని అందించే సినిమాను నమ్మేవాడిగా నా కెరీర్ లో ఇదో గొప్ప సినిమా. ఈ ఇద్దరు దిగ్గజాలకు నా హృదయపూర్వక మరియు అచంచలమైన కృతజ్ఞతను అందిస్తున్నాను. ఇప్పుడు, సంవత్సరాల తరబడి కొనసాగిన అగ్ని మరియు విశ్వాసం యొక్క ముగింపు చివరకు చేరుకుంది. ఇది మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండబోతుంది. ప్రేమ మరియు కోపంతో క్రిష్ జాగర్లముడి’ అని ఆయన వ్యక్తిగత ఖాతలో ట్వీట్ చేసారు.
Now… Hari Hara Veera Mallu walks into the world. Not quietly.. but with purpose.. with the weight of history and passion behind every frame. This journey was made possible by two great legends… not just in cinema, but in spirit..
🔥Our PAWAN KALYAN garu.. an extraordinary… pic.twitter.com/KZo14F1M2a
— Krish Jagarlamudi (@DirKrish) July 22, 2025
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!