మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ అయినా కూడా ఆచి తూచి సినిమాలు చేస్తోంది అనుష్క. రెండేళ్ల గ్యాప్ ఇచ్చి మరోసారి లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తుంది స్వీటి. గతంలో తనకు వేదం వంటి హిట్ ఇచ్చిన క్రిష్ దర్శకత్వంలో లేటెస్ట్గా ‘ఘాటీ’ సినిమా చేసింది అనుష్క. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయిబాబా నిర్మిస్తున్నారు. ఈ నెల 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది ఘాటీ.
Also Read : Tollywood : టాలీవుడ్ లో ప్లాప్స్ రావడంతో తమిళంపై కేరళ కుట్టీల దండయాత్ర…
ఈ నేపధ్యంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది యూనిట్. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో ఎక్కడ అనుష్క కనిపించలేదు. కేవలం డైరెక్టర్ క్రిష్ తో పాటు లీడ్ రోల్ చేస్తున్న విక్రమ్ ప్రభుతో పాటు జగపతి బాబు ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. అనుష్క ప్రమోషన్స్ లో కనిపించలేదు. స్వీటీ ఈ సినిమా ఓకే చేసిన రోజే ప్రమోషన్స్ కు రాలేనని చెప్పినట్టు క్రిష్ చెప్పాడు. కానీ వినిపిస్తున్న సమాచారాన్నీ బట్టి అనుష్క మీడియా ముందుకు వస్తే అనవసరమైన ప్రశ్నలు ముఖ్యంగా టాలీవుడ్ కు ఎందుకు దూరంగా ఉంటుంది, పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదు వంటి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే స్వీటీ మునుపటి కంటే కూడా ఇప్పుడు కాస్త లావెక్కిందని ఆ కారణంగా కూడా మీడియా ముందుకు రావడానికి ఇష్టపడట్లేదట. తెలుగులో స్వీటీ సినిమా చేసి రెండేళ్లు. ఇటీవల బాహుబలి యూనిట్ గెట్ టు గెదర్ లో కూడా స్వీటీ కనిపించలేదు. అన్నట్టు మలయాళంలో కథానార్ అనే సినిమా చేస్తోంది. మరి ఆ సినిమా ప్రమోషన్స్ కు స్వీటీ వెళుతుందో లేదో.