కేరళ కుట్టీలు తెలుగులో క్లిక్ అవ్వాలంటే ఇక్కడే నటించనక్కర్లేదు. జస్ట్ కోలీవుడ్‌లో ట్రై చేస్తే చాలు డబ్బింగ్ చిత్రాలతో ఎలాగో ఇక్కడి ఆడియన్స్‌కు చేరువైపోవచ్చు. ఇదే ఫార్ములాను ప్రజెంట్ యంగ్ బ్యూటీలు గట్టిగా ఫాలో అయిపోతున్నారు. ప్రేమలు బ్యూటీ మమితా బైజుకు ఒక్క తెలుగు ఆఫర్ లేదు. కానీ తమిళంలో బిగ్ హీరోలతో నటించే ఛాన్స్ కొల్లగొట్టేసింది. జననాయగన్, సూర్య46, ధనుష్54, డ్యూడ్ అన్నీకూడా బైలింగ్వల్ మూవీస్సే. నటిస్తోందేమో కోలీవుడ్ క్రేజేమో టాలీవుడ్ అన్నట్లు ఉంది మేడమ్ పరిస్థితి.
Also Read : Akhanda2 : తమన్ కారణంగానే అఖండ 2 రిలీజ్ వాయిదా.. నారా బ్రాహ్మణి కామెంట్స్..
మాలీవుడ్ ఫాలో అయ్యే వారికి అనేశ్వర రాజన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. నేరు, రేఖా చిత్రం, గురువాయిర్ అంబల్ నడయిల్ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు కనెక్టైన ఈ బ్యూటీ.. ఇక్కడ నేరుగా సినిమాలు చేయకపోయినా తమిళంలో టూ ఫిల్మ్స్ కమిటయ్యింది. అందులో 7/జీ రెయిన్ బో కాలనీ సీక్వెల్ తెలుగులో బృందావన్ కాలనీ2గా రాబోతుంది. అలాగే రీసెంట్లీ టూరిస్ట్ ఫ్యామిలీతో హిట్ కొట్టిన దర్శకుడు అభిషన్ జీవంత్ సరసన ఓ ఫిల్మ్ కమిటైంది. రజనీ డాటర్ సౌందర్య వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. కన్ను గీటీ ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా మారిన ప్రియా ప్రకాష్ వారియర్‌కు తెలుగు అస్సలు కలిసిరావడం లేదని కోలీవుడ్ చిత్రాలతోనే పలకరిస్తోంది. ఈఏడాది టూ ఫిల్మ్స్ గుడ్ బ్యాడ్ అగ్లీ, నిలవుక్కు ఎన్మేల్ ఎన్నాడీ కోబంతో అటు తమిళ ప్రేక్షకులను ఇటు తెలుగు ఆడియన్స్‌ను అలరించింది. ఇక మాళవిక మనోజ్ ఓ భామ అయ్యోరామతో క్లిక్ కాకపోయే సరికి ప్రజెంట్ తమిళంలో బ్రో కోడ్‌తో రెండూ ఇండస్ట్రీలను కవర్ చేసేస్తోంది. ఒక్క తెలుగు సినిమాతో సరిపెట్టేసిన చైల్డ్ ఆర్టిస్టు నుండి హీరోయిన్‌గా మారిన అనిఖా సురేంద్రన్‌ది కూడా ఇదే దారి. మాలీవుడ్ టూ టాలీవుడ్ వయా కోలీవుడ్ ప్రయాణీస్తున్నారు ఈ కేరళ ముద్దుగుమ్మలు.