సూరారై పొట్రుతో నేషనల్ లెవల్ గుర్తింపు తెచ్చుకున్న తెలుగు డైరెక్టర్ సుధా కొంగర. ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేసి చేతులు కాల్చుకుంది. దీని కన్నా ముందే సూర్యతో ‘పూరణనూరు’ ఎనౌన్స్ చేసింది. కారణాలు తెలియవు కానీ పూరణనూరు ప్రాజెక్టు నుండి సూర్య తప్పుకోగా, ఆ తర్వాత నజ్రియా, దుల్కర్ సల్మాన్ తప్పుకున్నారు. దీంతో ఈ సినిమా ఉంటుందా లేదా అన్న డౌట్ కూడా వచ్చింది. కానీ అమరన్‌తో హిట్ అందుకున్న శివకార్తీకేయన్ స్టోరీకి ఓకే చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక సెట్స్ మీదకు వెళ్లడమే తరువాయి అనుకుంటున్న క్షణంలో శివ-సుధాకు మధ్య గొడవలు జరిగాయన్న వార్తలు సర్క్యులేట్ అయ్యాయి.
Also Read : Salman Khan : సల్మాన్‌కు వింత సెంటిమెంట్.. కలిసొచ్చేనా .?
కట్ చేస్తే రీసెంట్లీ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సినిమాను రిస్క్ చేసి మరీ సుధా కొంగర భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తోందట. అమరన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శివకార్తీకేయన్ రేంజ్ పెరిగిపోవడంతో భారీ లెవల్లో సినిమాను తీయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. సుమారు రూ. 150 కోట్లు పెట్టి పూరణనూరు తెరకెక్కించబోతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. శివకార్తీకేయన్ రేంజ్ డబుల్ కావడంతో నేషనల్ లెవల్లో సినిమాను రిలీజ్ చేసి.. మరోసారి తన మార్క్ చూపించాలని భావిస్తోంది దర్శకురాలు సుధ. పూరణనూరుతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది టాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల. అలాగే జయం రవి, అధ్వర్య లాంటి స్టార్ కాస్ట్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారబోతున్నారు. ఎస్ కే 25గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు.