కొన్ని సినిమాలు చూస్తే, అరేయ్ ఇది ఆల్రెడీ చూసేసాం కదా అనిపించడం మాములే. ఇలాంటి సినిమాలనే ఫ్రీమేక్ అనో రీమేక్ అనో అంటుంటాం. ఓకే భాషలో సూపర్ హిట్ అయిన సినిమాని రైట్స్ కోనో, పర్మిషణ్ అడగకుండా లేపేసో మేకర్స్ దాన్ని ఇంకో భాషలో చేస్తుంటారు. కొరియన్ సినిమాల నుంచి మలయాళ సినిమాల వరకూ ఫాలో అయ్యే ట్రెండ్ ఇదే. అయితే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ఎక్కువ అవ్వడంతో ఈ మధ్య ఎక్కడ ఏ సినిమా బాగుంది అనిపించినా ఆడియన్స్ చూసేస్తున్నారు. అందుకే కాపీ అనే మాట వినిపించినా, రీమేక్ అనే మాట బయటకి వచ్చినా ఆడియన్స్ ఆ సినిమాపై ఇంటరెస్ట్ చూపించడం మానేస్తున్నారు. కంటెంట్ అవైలబిలిటి అనేది ఇప్పుడు యూనివర్సల్ అయిపొయింది ఈ విషయం కొందరు మేకర్స్ కి ఇంకా అర్ధం అయినట్లు లేదు. ముఖ్యంగా బాలీవుడ్ వాళ్లకి, మరీ ముఖ్యంగా కరణ్ జోహార్ కి అస్సలు అర్ధం అయినట్లు లేదు.
స్టార్ ప్రొడ్యూసర్ గా బాలీవుడ్ లో చక్రం తిప్పుతున్న కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేసిన లేటెస్ట్ మూవీ ‘గోవిందా నామ్ మేరా’. విక్కీ కౌశల్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ ని స్కిప్ చేసి డైరెక్ట్ గా ఒటీటీలో ప్రత్యక్షం అయ్యింది. విక్కీ కౌశల్ ట్రాక్ రికార్డ్ పైన ఉన్న నమ్మకమో, కియారా గ్లామర్ కోసమో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అవ్వగానే సినీ అభిమానులు ఈ మూవీని చూసేసారు. నార్త్ ప్రేక్షకులకి ఏమో కానీ సబ్ టైటిల్స్ ఆన్ చేసుకోని ‘గోవిందా నామ్ మేరా’ సినిమా చూసిన తెలుగు ప్రేక్షకులకి మాత్రం ‘అదేంటి ఇది మా Dj టిల్లు’ సినిమా కదా అనిపించకమానదు. సిద్ధూ జొన్నలగడ్డ, నేహ శెట్టి జంటగా నటించిన ‘Dj టిల్లు’ సినిమా తెలుగులో సూపర్ హిట్ అయ్యింది. ‘డైలాగ్స్’లో ఒక ట్రెండ్ ని క్రియేట్ చేసిన ఒక క్రేజీ సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ మూవీని ఆల్మోస్ట్ అందరూ చూశారు. దాదాపు ఇదే కథకి, ఔటర్ లేయర్ లో కొన్ని ఎలిమెంట్స్ ని యాడ్ చేసి రూపొందించిన సినిమానే ‘గోవిందా నామ్ మేరా’. అధికారికంగా ఎక్కడా అనౌన్స్మెంట్ కూడా లేదు కాబట్టి ‘గోవింద నామ్ మేరా’ మన ‘Dj టిల్లు’కి ఫ్రీమేక్ అయ్యి ఉంటుంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.