మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో ఇంద్ర సినిమా చాలా ప్రత్యేకం. బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రికార్డులు మీద రికార్డులు నమోదు చేసి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. జులై 24 నాటికి ఈ సినిమా రిలీజ్ అయి 22 ఏళ్ళు కంప్లిట్ అయింది. వైజయంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నాడు ఇంద్ర సినిమాను గ్రాండ్‌గా రీరిలీజ్ చేస్తున్నాం.” అంటూ వైజయంతీ మూవీస్ ప్రకటించింది. కానీ రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా కూడా నిర్మాణ సంస్థ నుండి ఎటువంటి హడావిడి కనిపించడంలేదు.
Also Read: Mass Maharaj: మాస్ రాజా రవితేజ, శ్రీలీల సినిమా టైటిల్ ఇదే..
జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇంద్ర రిలీజ్ కష్టమేనని అంటున్నాయి సినీ వర్గాలు. వాస్తవంగా ఇంద్ర సినిమాను ఆగస్టు 22న రీరిలీజ్ చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. కానీ ఇప్పుడు సమస్య అక్కడే వచ్చింది. ఆగస్టు 15 నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటికి థియేటర్ల అగ్రిమెంట్లు కూడా పూర్తి అయ్యాయి. ఇప్పుడు ఇంద్ర సినిమా ప్రదర్శించాలంటే ఈ కొత్త సినిమాల షోస్ క్యాన్సిల్ చేయాలి. అందుకు ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా సుముఖంగా లేడు. ఒక్క రోజు కోసం కొత్త సినిమాల ఆటలను ఆపడం కరెక్ట్ కాదని, ఆలా చేస్తే కలెక్షన్స్ మీద గట్టి ప్రభావం పడుతుందని, కావాలంటే ఇంద్ర సినిమాను వచ్చే వారానికి పోస్ట్ పోనే చేసుకోమని వైజయంతిని కోరుతున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఈ కారణంగా ఇంద్ర నిర్మాత అశ్వనీదత్ రీరిలీజ్ విషయమై పునరాలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 22న ఇంద్ర రీరిలీజ్ దాదాపు సందేహం అంటున్నారు. ఈ విషయమై ఆగస్టు 15న వైజయంతి మూవీస్ అధికారకంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం వినిపిస్తోంది.