గోవా బ్యూటీ ఇలియానా గురించి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్ గా కెరియర్ను కొనసాగించింది. ‘దేవదాసు’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ తన అందంతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాంతో ఈ మూవీ తర్వాత నుంచి ఈమెకు అదిరిపోయే రేంజ్ క్రేజీ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ ఇండస్ట్రీలో హీరోయిన్ ల కెరీర్ గురించి తెలియంది కాదు.. అవకాశాలు వచ్చినట్లే వచ్చి ఆగిపోతాయి. ఇలియాన విషయంలో కూడా ఇదే జరిగింది. దీంతో ఈ అమ్మడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రజంట్ ఇండస్ట్రీకి దూరంగా ఉండి.. తల్లి మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇలియానా సినీ ప్రయాణంలో ఒక కీలక మలుపు గురించి పంచుకుంది..
Also Read :Naveen Chandra : హనీతో నవీన్ చంద్ర కొత్త ప్రయాణం ప్రారంభం ..!
‘సినీ రంగం బాహ్యంగా గ్లామరస్‌గా కనిపించినా, వాస్తవానికి చాలా ఒత్తిడులు, భావోద్వేగాలతో కూడి ఉంటుంది. ముఖ్యంగా ‘దేవదాసు’ సినిమా టైమ్‌లో ఎదుర్కొన్న కష్టం ఎప్పటకి మర్చిపోలేను. ఫస్ట్ సినిమా కావడం వల్ల, సెట్స్‌లో కొత్త వాతావరణం, భాష, వర్క్ కల్చర్ వల్ల ఒత్తిడి ఎక్కువయ్యింది. దీంతో మా అమ్మకి ఫోన్ చేసి “సినిమా వదిలేస్తానని” ఏడ్చిన.. ఆ సమయంలో తల్లి ధైర్యం చెప్పడం వల్లే ఆమె ఆ సినిమాను పూర్తి చేయగలిగాను. ఈ సంఘటన నా జీవితాన్ని మార్చేసింది. అదే సినిమా నన్ను స్టార్ గా నిలిపింది.ఒత్తిడిలోనూ ధైర్యంగా ముందుకెళ్లడం ఎంత అవసరమో,మన కుటుంబ సభ్యుల మద్దతు కూడా అంతే ముఖ్యం’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.