Ilayaraja : ఇళయరాజాకు భారీ షాక్.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగీత జ్ఞాని ఇళయరాజాకు న్యాయస్థానంలో భారీ షాక్ తగిలింది. ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ‘సరిగమ ఇండియా లిమిటెడ్’ సంస్థతో నడుస్తున్న కాపీరైట్ వివాదంలో ఢిల్లీ హైకోర్టు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇళయరాజాకు వ్యతిరేకంగా ఇచ్చిన మధ్యంతర స్టే (ఇంజంక్షన్ ఆర్డర్)ను ఎత్తివేయడానికి కోర్టు సెంటిమెంట్‌గా నిరాకరించింది. ఫలితంగా, ఆ 134 సినిమాల్లోని పాటలపై ఇళయరాజాకు ప్రస్తుతానికి ఎలాంటి హక్కులు ఉండవని స్పష్టమైంది.
అసలేమిటీ వివాదం?
ఈ వివాదం మొత్తం 134 సినిమాలలోని సౌండ్ రికార్డింగ్‌లు, లిరిక్స్, మ్యూజికల్ వర్క్స్‌కు సంబంధించింది. ఇందులో ఇళయరాజా క్లాసిక్స్ అయిన అన్నకిలి, 16 వయతినిలే, కవిక్కుయిల్, భారతి, పల్లవి అను పల్లవి, ముల్లుమ్ మలరుమ్, రాజా పార్వై, నెట్రికన్, కల్యాణరామన్ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. ఈ సినిమాల మ్యూజిక్ రైట్స్, ఓనర్షిప్ తమదేనంటూ ‘సరిగమ’ సంస్థ కోర్టును ఆశ్రయించింది. తమకు తెలియకుండా ఇళయరాజా ఈ పాటలను వేరే ప్లాట్‌ఫారమ్‌లకు లైసెన్స్ ఇస్తున్నారని, యాజమాన్య హక్కులు క్లెయిమ్ చేస్తున్నారని ఆరోపించింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ తుషార్ రావు నేతృత్వంలోని సింగిల్ బెంచ్.. గత ఫిబ్రవరి 13న ఇళయరాజాపై ఎక్స్-పార్టీ మధ్యంతర స్టే విధించింది. ఈ ఆర్డర్ ప్రకారం సరిగమ కాపీరైట్ కలిగి ఉన్న పాటలను వాడటం, వేరొకరికి లైసెన్స్ ఇవ్వడం లేదా ఓనర్షిప్ క్లెయిమ్ చేయడం వంటివి ఇళయరాజా చేయకూడదు. ఈ స్టేను రద్దు చేయాలంటూ ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తాజాగా తిరస్కరించింది.
Also Read
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
- Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
- Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
1901లో ‘ది గ్రామోఫోన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్’ పేరుతో ప్రారంభమైన తమ సంస్థకు కొన్ని దశాబ్దాల చరిత్ర ఉందని సరిగమ కోర్టుకు తెలిపింది. 1976 నుంచి 2001 మధ్య కాలంలో ఆయా సినిమాల నిర్మాతలతో తాము కుదుర్చుకున్న అగ్రిమెంట్ల ప్రకారం.. ఆయా పాటల పూర్తి కాపీరైట్స్ (సౌండ్ రికార్డింగ్, సాహిత్యం, సంగీతం) తమకే చెందుతాయని స్పష్టం చేసింది. తమిళ్, హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో తమకు భారీ మ్యూజిక్ క్యాటలాగ్ ఉందని పేర్కొంది. అయితే, ఇటీవల అమెజాన్ మ్యూజిక్, ఐట్యూన్స్, జియోసావన్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో తమ కాపీరైట్ కంటెంట్‌ను ఇళయరాజా క్లెయిమ్ చేస్తున్నట్లు గుర్తించామని, అంతకుముందు జనవరిలో ఆయన పంపిన లీగల్ నోటీసులో కూడా ఈ పాటలన్నీ తానే కంపోజ్ చేసి, ఆర్కెస్ట్రేషన్ చేసినందున హక్కులు తనవేనని వాదించారని సరిగమ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
తాజావార్తలు
-
KTR : కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. కేటీఆర్ ఫైర్.!
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!